పితృభక్తి ఉంటే జీవితంలో విజయం ఎందుకు సులభమవుతుంది? తండ్రి ఆశీర్వాదం ఉంటే జీవితంలో అద్భుతాలు జరుగుతాయా?
తండ్రి కుటుంబానికి వెన్నెముక వంటివాడు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా పిల్లల కోసం కష్టపడుతూ, త్యాగాలు చేస్తూ వారి ఆనందం కోసం జీవిస్తాడు. భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులను దైవ సమానులుగా భావిస్తారు. అందుకే తండ్రిని గౌరవించడం ప్రతి ఒక్కరి ప్రధాన ధర్మం.
మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవోభవ అని మనం అంటాము. అయితే తండ్రిని గౌరవించడం గురించి మాట్లాడుకుంటే, తండ్రిని గౌరవించి, తండ్రిని ఒక దైవంగా భావిస్తే ఆ పిల్లలు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు.

ప్రతి మనిషి జీవితంలో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా అండగా నిలిచే వ్యక్తి నాన్న. కష్టాలను కూడా దిగమింగుకుంటాడు. పిల్లల ముఖంలో నవ్వు చూడాలని నిరంతరం ఏదో ఒకటి త్యాగం చేస్తూనే ఉంటాడు. ఏదో ఒక బాధను, కష్టాన్ని దాటుతూ ఉంటాడు. కుటుంబానికి వెన్నెముక నాన్న.
భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులను దైవ సమానులుగా భావిస్తాము. ఉపనిషత్తులు "మాతృదేవోభవ, పితృదేవోభవ" అని చెప్పడం ద్వారా తల్లిదండ్రులను గౌరవించడం ఒక మనిషి ప్రధాన ధర్మం అని గుర్తు చేస్తాయి. అయితే ఇది కేవలం మతపరమైన నమ్మకం అనుకుంటే పొరపాటే. ఉన్నతమైన జీవన ప్రమాణాలను పెంపొందించే సందేశం ఇది.
విజయానికి పునాది వేస్తారు నాన్న
మన మూలాలను, మనల్ని తీర్చిదిద్దిన శిల్పిని గౌరవించడం అంటే విజయానికి పునాది వేయడమే. నాన్న ఆశీస్సులు ఉంటే కష్టాలన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి. నాన్న అనుభవాలు, నాన్న నేర్పిన పాఠాలు అన్నీ కూడా జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి హెల్ప్ అవుతాయి.
తండ్రిని గౌరవించే పిల్లల జీవితం చాలా బాగుంటుంది. తండ్రిని గౌరవించే పిల్లలు త్వరగా జీవితంలో స్థిరపడతారు. మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది. తండ్రి సంతోషంగా ఉంటే కుటుంబంలో శుభసంపదలు, శాంతి కలుగుతాయి. నిజానికి ఇదే నిజమైన ఫాదర్స్ డే. ఫాదర్స్ డే అంటే పోస్టులు పెడితే సరిపోదు. ఆయన్ని మనస్ఫూర్తిగా పలకరించాలి. ఆయన అనుభవాలను వినాలి. ఆయన పట్ల కృతజ్ఞతలు వ్యక్తపరచాలి. అదే నిజానికి మనం నాన్నకు ఇచ్చే గొప్ప బహుమతి. నాన్న కళ్లల్లో ఆనందం చూడడం అనేది నిజమైన ఫాదర్స్ డే బహుమతి అని చెప్పొచ్చు.
నాన్న శిక్షకుడి నుంచి మార్గదర్శకుడు. నాన్న కేవలం డబ్బు సంపాదించే యంత్రం కాదని గుర్తుపెట్టుకోవాలి. పిల్లలకు మంచి గురువు నాన్న. జీవితమంటే వట్టి చదువు మాత్రమే కాదు, కష్టాల్లో నిలబడడం కూడా అని తన ప్రవర్తన ద్వారా మనకు తెలుస్తుంది. తండ్రి క్రమశిక్షణ, విలువలు పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. సమాజంలో మంచి సంస్కారవంతులుగా ఎదగాలంటే కచ్చితంగా తండ్రి చూపించిన బాటలో నడవడం ముఖ్యం. కష్టాన్ని చిరునవ్వుతో మోసే సూపర్ హీరోలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుందాం.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


