...
...
Next Story

పెళ్లి ఆలస్యమవుతోందా? ఈ బర్త్ నెంబర్‌వారికి లేటుగానైనా మంచి భాగస్వామి దొరుకుతారు!

న్యూమరాలజీ ప్రకారం 8 సంఖ్యవారు పెళ్లి ఆలస్యం అవుతుందని చింతించకండి. వేచి ఉన్నందుకు లభించే ప్రతిఫలాన్ని పొందండి. మీకు కచ్చితంగా అత్యంత ప్రేమగల, అండగా నిలిచే జీవిత భాగస్వామి దొరుకుతారు.

Published on: Jul 13, 2026, 08:52:49 IST
Advertisement

సంఖ్యాశాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి పుట్టిన తేదీ వారి వ్యక్తిత్వం, భవిష్యత్తు, వృత్తి, వైవాహిక జీవితం గురించి ముఖ్యమైన సమాచారాన్ని వెల్లడిస్తుంది. వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. అయితే సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని నిర్దిష్ట తేదీలలో జన్మించిన వారు సాధారణంగా ఆలస్యంగా వివాహం చేసుకుంటారు. ఆశ్చర్యకరంగా వివాహం ఆలస్యమైనప్పటికీ.. వారు తమకు తగిన, అర్థం చేసుకునే జీవిత భాగస్వామిని చూసుకుంటారు.

న్యూమరాలజీ
న్యూమరాలజీ

న్యూమరాలజీ ప్రకారం.. ఏ నెలలోనైనా 8వ, 17వ లేదా 26వ తేదీన జన్మించిన వారి సంఖ్య 8 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి కర్మ ప్రదాత అయిన శని. సంఖ్యాశాస్త్రంలో శనిని నెమ్మదైన గ్రహంగా, న్యాయానికి అధిపతిగా పరిగణిస్తారు. శని ప్రభావం వల్ల ఈ సంఖ్యలో జన్మించిన వారి జీవితంలోని ప్రతి ముఖ్యమైన సంఘటన, ముఖ్యంగా వివాహం, నెమ్మదిగా, ఆలస్యంగా జరుగుతుంది.

8 సంఖ్య కింద జన్మించిన వారు తమ కెరీర్, ఆర్థిక భద్రత, భవిష్యత్ లక్ష్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. జీవితంలో ఒక నిర్దిష్ట దశకు చేరుకునే వరకు వారు వివాహం గురించి ఆలోచించరు. ఈ పరిణతి, పరిపక్వతే వివాహాన్ని ఆలస్యం చేయడానికి ప్రధాన కారణంగా చెబుతారు. ఈ సంఖ్య కింద జన్మించిన వారు ప్రేమ సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎవరినీ అంత సులభంగా నమ్మరు, కానీ ఒక్కసారి నమ్మితే జీవితాంతం విశ్వాసపాత్రులుగా ఉంటారు. వివాహానికి ముందు తమ భాగస్వామి గుణగణాలను, స్వభావాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి చాలా సమయం తీసుకుంటారు.

తొందరపడి ఏ నిర్ణయం తీసుకోని గుణం వీరి భవిష్యత్ వివాహంలో ఎలాంటి మనస్పర్థలు రాకుండా నివారిస్తుంది. ఒకవేళ ఆలస్యంగా వివాహం చేసుకున్నా.. తగిన, ఆలోచనలకు సరిపోయే, జీవితంలోని ప్రతి సుఖంలోనూ, కష్టంలోనూ వారికి అండగా నిలిచే మంచి భాగస్వామి దొరుకుతారు. శని ప్రభావం వల్ల తమ సంబంధాలలో నిజాయితీగా, విశ్వసనీయంగా ఉంటారు. ఇతరుల కన్నా వారి వైవాహిక జీవితం మరింత సురక్షితంగా, సన్నిహితంగా, ప్రశాంతంగా ఉంటుంది.

వివాహం తర్వాత భాగస్వామి బాధ్యతలను పంచుకుంటూ ప్రతి అడుగులోనూ వారికి అండగా నిలుస్తారు. దీనివల్ల వివాహం తర్వాత వారి ఆర్థిక, సామాజిక హోదా పెరుగుతుంది. మొత్తమ్మీద 8వ సంఖ్య గలవారు తమ వివాహం ఆలస్యం అవుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదట.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe