Kanuma 2026: కనుమ నాడు ఎందుకు ప్రయాణాలు చెయ్యకూడదు? ఆ రోజు ఏం చెయ్యాలో తెలుసుకోండి!

సంక్రాంతి నాడు పిల్లాపాపలతో సంతోషంగా జరుపుకుంటారు. పిండి వంటలు చేసుకోవడం, గంగిరెద్దులు, భోగి మంటలు, కోడిపందాలు ఇలా ఎన్నో ఉంటాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగ సందడి అంతా ఊర్లోనే ఉన్నట్టు సరదాగా, సంతోషంగా పండుగను జరుపుకుంటారు. కనుమ నాడు ఎందుకు ప్రయాణాలు చెయ్యకూడదు? ఆ రోజు ఏం చెయ్యాలో తెలుసుకోండి.

Published on: Jan 15, 2026, 13:30:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు వారు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి. సంక్రాంతి నాడు అందరూ పిల్లాపాపలతో సంతోషంగా జరుపుకుంటారు. పిండి వంటలు చేసుకోవడం, గంగిరెద్దులు, భోగి మంటలు, కోడిపందాలు ఇలా ఎన్నో ఉంటాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగ సందడి అంతా ఊర్లోనే ఉన్నట్టు సరదాగా, సంతోషంగా పండుగను జరుపుకుంటారు.

Kanuma 2026: కనుమ నాడు ఎందుకు ప్రయాణాలు చెయ్యకూడదు? (pinterest)
Kanuma 2026: కనుమ నాడు ఎందుకు ప్రయాణాలు చెయ్యకూడదు? (pinterest)

సంక్రాంతి పండుగ 2026

సంక్రాంతి పండుగను మొత్తం మూడు రోజుల పాటు జరుపుకుంటారు. మూడవ రోజు కనుమ పండుగను జరుపుకుంటారు. కనుమ పండుగ నాడు పశువులను అందంగా అలంకరించి పూజలు చేస్తారు. సాయంత్రం ఊరేగింపు చేస్తారు. అయితే కనుమ నాడు పశువులకు ఇష్టమైన ఆహారాన్ని కూడా వండి పెడతారు. ఇక ఇది ఇలా ఉంటే, కనుమ నాడు పొలిమేర దాటకూడదని పెద్దలు అంటారు. అయితే అలా ఎందుకు చెబుతారు? కనుమ నాడు పాటించాల్సినవి ఏంటి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కీడు జరుగుతుందని ప్రయాణం చేయొద్దంటారు

కనుమ నాడు ప్రయాణం చేస్తే కీడు జరిగే అవకాశం ఉందని అంటారు. అందుకే మూడు రోజుల పాటు పండుగను జరుపుకుని, ఆ తర్వాత ప్రయాణం చేయమని పెద్దలు అంటారు. అయితే, ఇది ఎవరి అభిప్రాయం వారిదే. ఎవరికి నచ్చినట్లు వారు ఫాలో అవుతూ ఉంటారు.

పశువులకు పూజలు, పూర్వికులకు తర్పణాలు

కనుమ నాడు ఉదయాన్నే పశువుల్ని ఆరాధించి, మధ్యాహ్నం పూట పూర్వీకులకు తర్పణలు ఇవ్వడం వంటివి జరుపుతారు. కొన్ని చోట్ల అయితే కనుమ నాడు గ్రామ దేవతలకు కోడి, గొర్రె, పొట్టేళ్లు, మేకపోతులను బలి ఇస్తారు. కనుమ నాడు ఇలా చాలా పనులు ఉంటాయి కనుక, ఈ రోజు ప్రయాణం చేయొద్దని, విశ్రాంతి తీసుకోమని పెద్దలు అంటారు.

విందు భోజనాలు

సంక్రాంతి పండుగకు మొదటి రెండు రోజులు పిండి వంటలు చేసుకుని తింటారు. మూడవ రోజు మాత్రమే మాంసాహారం తింటారు. కనుమ నాడు పోషక విలువలు ఎక్కువగా ఉండే మినుములను కూడా తినమని చెబుతారు. వీటిని తింటే శరీరానికి తగినంత వేడి అందుతుంది. చలిని తట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది.

ముక్కనుమ పండుగ

ముక్కనుమను ఎక్కువగా గోదావరి జిల్లాల్లో, ఉత్తరాంధ్రలో బాగా జరుపుకుంటారు. ఆ రోజు పుష్టిగా మాంసాహారాన్ని తింటారు. తమిళనాడులో అయితే ముక్కనుమ నాడు తాజా కూరగాయలతో కందిపప్పు, చింతపండు, బెల్లం కలిపి ప్రత్యేక వంటకాన్ని చేసుకుంటారు. కనుమ, ముక్కనుమ నాడు దేవతలందరూ మన ఇంటికి వస్తారని అంటారు. అందుకనే ఆ రోజు ప్రయాణం చేయకూడదని కూడా చెప్తారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More