...
...
Next Story

మంచంపై కూర్చుని చదవడం, వర్క్ చేయడం తప్పా? ఇది తెలిస్తే ఇకపై ఈ తప్పులు చెయ్యరు!

మంచం కంఫర్ట్ గా ఉందని చాలామంది మంచం పైన తింటారు, మంచం పైనే కూర్చుని చదువుకుంటారు, మంచం పైనే కూర్చుని వర్క్ చేస్తూ ఉంటారు. కానీ నిజానికి ఇది చాలా పెద్ద తప్పు. దీని వలన కలిగే నష్టాలు ఏంటి? పని చేసేటప్పుడు అదృష్టం పెరగడానికి పాటించాల్సిన వాస్తు నియమాలు గురించి ఇప్పుడే తెలుసుకోండి.

Published on: May 20, 2026 12:30 PM IST
Advertisement

గ్రహాల ప్రభావం మనపై చాలా ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలా మంది ఇంటి నుంచి పని చేస్తున్నారు. అలాగే పిల్లలు కూడా ఇంట్లో చదువుకుంటూ ఉంటారు. పని చేసుకునేటప్పుడు, చదువుకునేటప్పుడు ఎందుకు మంచంపై కూర్చుని చేయకూడదు? పెద్దలు కూడా చాలా సార్లు మంచం మీద కూర్చుని పని చెయ్యద్దని, చదవద్దని అంటుంటారు.

మంచంపై కూర్చుని చదవడం, వర్క్ చేయడం తప్పా? ఇది తెలిస్తే ఇకపై ఈ తప్పులు చెయ్యరు!
మంచంపై కూర్చుని చదవడం, వర్క్ చేయడం తప్పా? ఇది తెలిస్తే ఇకపై ఈ తప్పులు చెయ్యరు!

చాలామంది చదువుకునేటప్పుడు, ల్యాప్‌టాప్‌తో పని చేసేటప్పుడు మంచంపై కూర్చుని చదవడం, పని చేయడం వంటివి చేస్తారు. అయితే ఇది నిజానికి తప్పు. వాస్తు శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే ఇది చాలా ప్రమాదకరమైన అలవాటు అని తెలుస్తోంది. ఈ చిన్న పొరపాటు ఆరోగ్యాన్ని, వృత్తిపరమైన ఎదుగుదలను అడ్డుకుంటుంది. అలాగే ఇంట్లో ఉండే సానుకూల శక్తిని కూడా హరిస్తుంది. మరి ఎందుకు ఇన్ని సమస్యలు వస్తాయి? మంచంపై కూర్చుని చదువుకోవడం లేదా పని చేయడం వలన ఎందుకు ఇబ్బందులు వస్తాయి? ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రహాల శక్తి మధ్య ఘర్షణ

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, మన ఇంట్లో ప్రతి వస్తువు, ప్రతి మూల కూడా ఏదో ఒక గ్రహంతో ముడిపడి ఉంటుంది. మనం నిద్రపోయే మంచం సుఖ శాంతులకు కారకుడైన శుక్రుడికి, మనశ్శాంతిని ఇచ్చే చంద్రుడికి ప్రతీక. మనం చేసే పని బుధుడికి సంబంధించినది. క్రమశిక్షణను పెంచే శని దేవుడితో కూడా మనం చేసే పనికి సంబంధం ఉంటుంది. విశ్రాంతి తీసుకోవాల్సిన చోట పని చేస్తే అక్కడ గ్రహాల శక్తుల మధ్య ఘర్షణ ఏర్పడుతుంది. మానసిక గందరగోళం, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు, అలసటగా అనిపించడం లాంటి సమస్యలు వస్తాయి.

రాహువు, కేతువుల ప్రతికూల ప్రభావం

మంచంపై కూర్చుని చదవడం వలన శరీరంలో క్రమశిక్షణ తగ్గుతుంది. దీని వలన చదువులో నాణ్యత తగ్గుతుంది. లక్ష్యాలను పూర్తి చేయలేరు. కాబట్టి మంచంపై కూర్చుని చదవడం, పని చేయడం లేదా భోజనం చేయడం వంటివి చేయకూడదు. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా తగ్గిపోతుంది. ధన ప్రవాహం ఆగిపోతుంది. ఆర్థిక సమస్యలు రావచ్చు.

ఆరోగ్యం పై ప్రభావం

గంటల తరబడి మంచంపై వంగి కూర్చోవడం వలన వెన్నునొప్పి, స్లిప్ డిస్క్, మెడ పట్టేయడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టదు.

అదృష్టం పెరగాలంటే పని చేసేటప్పుడు ఈ వాస్తు నియమాలను పాటించండి

  • పని చేసేటప్పుడు మంచంపై కూర్చోవద్దు. ప్రత్యేకంగా ఒక టేబుల్, కుర్చీని ఏర్పాటు చేసుకోవాలి.
  • వర్క్ చేసే ప్రదేశం ఇంటికి ఉత్తర లేదా తూర్పు దిశలో ఉండేటట్టు చూసుకోవాలి. పని చేసేటప్పుడు ముఖం తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండేలా కూర్చోండి. ఏకాగ్రతను పెంపొందించుకోవచ్చు.
  • మీ పని ప్రదేశం శుభ్రంగా ఉండాలి. లేదంటే సానుకూల శక్తి తొలగి, ప్రతికూల శక్తి ఏర్పడుతుంది.

వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక సౌకర్యం, కానీ మంచాన్ని కార్యాలయంగా మార్చవద్దు. చిన్న అలవాట్లు జీవిత గమనాన్ని మార్చగలవు. మీరు ఇంట్లో మీ విజయం, ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు విలువ ఇస్తే, ఈ రోజు మంచం మీద పనిచేయడం మానేయండి. నిరాకరణ: ఈ వ్యాసంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము చెప్పుకోము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe