హిందూమతంలో ప్రతి నెల ఏకాదశి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. కానీ యోగిని ఏకాదశి అత్యంత ఫలవంతమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండి పూజలు చేయడం వల్ల వేలాది మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. అందువల్ల ఈ ఏకాదశి నాడు కథ వినడం, ఉపవాసం పాటించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. పురాణాల ప్రకారం ఈ వ్రత కథను శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి వివరించాడు. ఆ కథేంటో మీరు చదవండి.

స్వర్గంలో అలకాపురి అనే అందమైన నగరం ఉండేది, దానిని కుబేరుడు అనే రాజు పరిపాలించేవాడు. అతను శివ భగవానుడికి గొప్ప భక్తుడు. హేముడు అనే తోటమాలి రోజువారీ పూజ కోసం పువ్వులు తెచ్చేవాడు. హేముని భార్య విశాలాక్షి చాలా అందంగా ఉండేది, అతను ఆమెను గాఢంగా ప్రేమించేవాడు.
ఒక రోజు హేముడు మానస సరోవరం నుండి పువ్వులు తెచ్చాడు. కానీ తన భార్య ప్రేమలో ఎంతగా మునిగిపోయాడంటే, వాటిని పూజ సమయానికి అందించలేకపోయాడు. ఈ విషయం కుబేరుడికి తెలియగానే, అతనికి తీవ్రమైన కోపం వచ్చింది. అతను హేముడిని శపిస్తూ, అతను తన భార్య నుండి విడిపోయి భూలోకంలో కుష్ఠురోగిగా జీవిస్తాడని శాపం ఇచ్చాడు.
శాపం ప్రభావంతో హేముడు కుష్ఠు వ్యాధితో బాధపడుతూ వెంటనే స్వర్గం నుండి భూమి మీదకు పడిపోయాడు. అతని భార్య కూడా అతనికి దూరమైంది. చాలా కాలం బాధపడ్డాడు.. కానీ తన పూర్వజన్మలోని సంఘటనలు వెంటాడుతూ ఉండేవి. ఒక రోజు అలాగే సంచరిస్తూ.. అతను మార్కండేయ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. పరిస్థితిని చూసిన ఆ మహర్షి కారణం అడగ్గా, హేముడు తన పూర్తి కథను ఆయనకు చెప్పాడు.
అతని దుస్థితిని విన్న మార్కండేయ మహర్షి, హేముడికి యోగిని ఏకాదశి వ్రతం ఆచరించమని సలహా ఇచ్చాడు. పూర్తి క్రతువులతో ఆ వ్రతాన్ని ఆచరించాడు హేముడు. దాని ఫలితంగా శాపం తొలగిపోయి, అతను తన అసలు రూపాన్ని తిరిగి పొంది, తన భార్యతో సుఖంగా జీవించాడు. అందుకే యోగిని ఏకాదశిని పాపాల నుండి విముక్తి కలిగించి, సుఖసంతోషాలను ప్రసాదించే వ్రతంగా పరిగణిస్తారు.
{{/usCountry}}అతని దుస్థితిని విన్న మార్కండేయ మహర్షి, హేముడికి యోగిని ఏకాదశి వ్రతం ఆచరించమని సలహా ఇచ్చాడు. పూర్తి క్రతువులతో ఆ వ్రతాన్ని ఆచరించాడు హేముడు. దాని ఫలితంగా శాపం తొలగిపోయి, అతను తన అసలు రూపాన్ని తిరిగి పొంది, తన భార్యతో సుఖంగా జీవించాడు. అందుకే యోగిని ఏకాదశిని పాపాల నుండి విముక్తి కలిగించి, సుఖసంతోషాలను ప్రసాదించే వ్రతంగా పరిగణిస్తారు.
{{/usCountry}}యోగిని ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి, ఉపవాసం ఉంటారు. అనంతరం మీ పూజా స్థలంలో ఒక కలశాన్ని ప్రతిష్ఠించి, దానిపై విష్ణుమూర్తి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ఉంచండి . భక్తిశ్రద్ధలతో దేవునికి పువ్వులు, పండ్లు సమర్పించి, దీపం వెలిగించి, హారతి ఇవ్వండి. బెల్లం, శనగలు సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ ఆచారం మీ జీవితంలోకి సానుకూల శక్తిని తీసుకువచ్చి, లక్ష్మీదేవి ఆశీస్సులను అందిస్తుంది.