జ్యేష్ఠ పూర్ణిమ 2026: ఈ 10 పరిహారాలు చేస్తే విష్ణు-శివ అనుగ్రహం!

హిందూ ధర్మంలో ప్రతి పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నప్పటికీ, జ్యేష్ఠ మాసంలో వచ్చే జ్యేష్ఠ పూర్ణిమ అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. 2026 జూన్ 29, సోమవారం ఈ పూర్ణిమ వస్తుండగా, పూర్ణిమ తిథి జూన్ 29 తెల్లవారుజామున 3:06 గంటలకు ప్రారంభమై, జూన్ 30 ఉదయం 5:26 గంటలకు ముగుస్తుంది.

Published on: Jun 27, 2026, 16:00:59 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి నెలలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రస్తుతం జ్యేష్ఠ మాసం కనుక జ్యేష్ఠ పూర్ణిమ రాబోతోంది. జ్యేష్ఠ పూర్ణిమ జూన్ 29, సోమవారం నాడు వచ్చింది. పూర్ణిమ తిథి జూన్ 29 తెల్లవారుజామున 3:06కి మొదలై, జూన్ 30 ఉదయం 5:26తో ముగుస్తుంది.

జ్యేష్ఠ పూర్ణిమ 2026: ఈ 10 పరిహారాలు చేస్తే విష్ణు-శివ అనుగ్రహం!
జ్యేష్ఠ పూర్ణిమ 2026: ఈ 10 పరిహారాలు చేస్తే విష్ణు-శివ అనుగ్రహం!

జ్యేష్ఠ పూర్ణిమ చాలా శుభప్రదమైన రోజు, అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున స్నానాలు, దానాలు, సత్యనారాయణ స్వామి వ్రతం, ఉపవాసం, విష్ణు-శివ ఆరాధన చేయడం వలన మంచి ఫలితాలను చూడొచ్చు. జ్యేష్ఠ పూర్ణిమకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఆ రోజు స్నానాలు, దానాలు, ఉపవాసం పాటిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. పురాణాల ప్రకారం, ఆరోజు చేసిన సత్కార్యాలు అనేక రెట్లు ఫలితాన్ని ఇస్తాయి.

జ్యేష్ఠ పూర్ణిమ రోజున చేయాల్సిన పరిహారాలు

1.చంద్రుడికి అర్ఘ్యం:

చంద్రోదయం తర్వాత పాలతో కలిపిన నీటిని లేదా స్వచ్ఛమైన నీటిని చంద్రుడికి సమర్పిస్తే మంచి ఫలితాలను చూడొచ్చు. అలాగే మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.

2.పవిత్ర స్నానం:

ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి నది లేదా గంగాజలం కలిపిన నీటితో స్నానం చేస్తే మంచి ఫలితాలను చూడొచ్చు. ఆ తర్వాత పరిశుభ్రమైన దుస్తులను ధరించండి.

3.విష్ణు-లక్ష్మీదేవిని పూజించండి:

విష్ణువు, లక్ష్మీదేవిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే విష్ణు సహస్రనామం లేదా లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేస్తే కూడా మంచి ఫలితాలను చూడొచ్చు.

4.తులసి పూజ:

తులసి మొక్కకు నీరు పోసి, దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయండి. అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. కుటుంబంలో శాంతి, శ్రేయస్సు కూడా కలుగుతాయి.

5.సత్యనారాయణ వ్రతం:

ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. లేదంటే సత్యనారాయణ స్వామి కథ విన్నా కూడా మంచిదే.

6.పితృ తర్పణం:

పితృదేవతలను స్మరిస్తూ తర్పణం చేయడం వలన పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది.

7.రావి చెట్టు పూజ:

రావి చెట్టు వద్ద నీళ్లు పోసి, దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయండి. విష్ణుమూర్తి అనుగ్రహంతో ఆనందంగా ఉండొచ్చు.

8.గాయత్రీ మంత్రం:

గాయత్రీ మంత్రం లేదా "ఓం నమో నారాయణాయ" అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఆధ్యాత్మిక శాంతిని పొందవచ్చు.

9.పశు, పక్షులకు ఆహారం:

ఆవులకు పచ్చగడ్డి, పక్షులకు ధాన్యం, కుక్కలకు ఆహారం అందిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది.

10.దానాలు:

బియ్యం, గోధుమలు, నువ్వులు, నీటి కుండలు, వస్త్రాలు, అన్నదానం, పండ్లు వంటి దానాలు చేస్తే కూడా అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. ఎంతో పుణ్యం కలుగుతుంది. విష్ణువు, శివుని అనుగ్రహంతో ఆనందం రెట్టింపు అవుతుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More