కొందరి మనసు ఎంతో వెన్నలా ఉంటుంది. ఎదుటివారి కష్టాన్ని చూసి చలించిపోయి, తమకు వీలైన సాయం చేయడానికి క్షణం కూడా ఆలోచించరు. కానీ, ఈ స్వభావమే కొన్నిసార్లు వారికి శాపంగా మారుతుంది. తాము నమ్మి చేసిన సహాయమే కొందరికి అవకాశవాదంగా మారుతుందని వీరు గ్రహించలేరు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మీనం, కర్కాటకం, వృషభ రాశుల వారు అత్యంత దయగల స్వభావం కలిగి ఉంటారు. మరి ఈ రాశుల వారు ఎందుకు ఇతరుల మోసాలకు బలవుతారో వివరంగా తెలుసుకుందాం.
మీన రాశి
జ్యోతిష్య శాస్త్రంలో మీన రాశి వారిని అత్యంత సున్నితమైన మనసున్నవారిగా పేర్కొంటారు. వీరు ఇతరుల భావోద్వేగాలను ఇట్టే అర్థం చేసుకుంటారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే చూసి వీరు తట్టుకోలేరు. అవతలి వారు సాయం కోరకముందే ముందుకు వచ్చి అండగా నిలుస్తారు.
అయితే, ఈ విశేషమైన గుణమే కొందరికి అనుకూలంగా మారుతుంది. వీరు ఇతరులను గుడ్డిగా నమ్ముతారు. అవతలి వారి నిజస్వరూపాన్ని అంచనా వేయకుండా సహాయం అందిస్తారు. అవసరం తీరిన తర్వాత కొందరు వీరికి చేతులెత్తేస్తారు. అందుకే మీన రాశి వారు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మకుండా, తమ విచక్షణను ఉపయోగించడం చాలా ముఖ్యం.
కర్కాటక రాశి
కుటుంబానికి, బంధుమిత్రులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే రాశుల్లో కర్కాటకం ప్రథమ స్థానంలో ఉంటుంది. ఆత్మీయుల సుఖ సంతోషాల కోసం వీరు తమ స్వార్థాన్ని పూర్తిగా పక్కన పెడతారు. కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు కొండంత భరోసాగా నిలుస్తారు. వీరికి ప్రతి బంధం కేవలం మాటలకే పరిమితం కాదు, అంతులేని నమ్మకంతో కూడుకున్నది.
కానీ, వీరి ఈ అమితమైన శ్రద్ధే కొందరికి చులకన భావాన్ని కలిగిస్తుంది. కర్కాటక రాశి వారు తమ అవసరాలను పక్కన పెట్టి మరీ తమకు సాయం చేస్తారనే భావనతో కొందరు వీళ్ళను తేలికగా తీసుకుంటారు. తమ సమయానికి, భావోద్వేగాలకు విలువ ఇవ్వడం లేదని గ్రహించి, వీరు ఎక్కడ ఎవరికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో బేరీజు వేసుకోవడం చాలా అవసరం.
వృషభ రాశి:
{{/usCountry}}కానీ, వీరి ఈ అమితమైన శ్రద్ధే కొందరికి చులకన భావాన్ని కలిగిస్తుంది. కర్కాటక రాశి వారు తమ అవసరాలను పక్కన పెట్టి మరీ తమకు సాయం చేస్తారనే భావనతో కొందరు వీళ్ళను తేలికగా తీసుకుంటారు. తమ సమయానికి, భావోద్వేగాలకు విలువ ఇవ్వడం లేదని గ్రహించి, వీరు ఎక్కడ ఎవరికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో బేరీజు వేసుకోవడం చాలా అవసరం.
వృషభ రాశి:
{{/usCountry}}వృషభ రాశి వారు సహజంగానే ప్రశాంతంగా, నిగ్రహంతో మరియు అందరితో మర్యాదపూర్వకంగా నడుచుకుంటారు. వీరు ఎవరితోనూ అనవసరమైన గొడవలకు దిగరు. నిజాయితీకి పెద్దపీట వేస్తారు. అవతలి వారు కష్టంలో ఉంటే ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా తమ సొంత నష్టాలను లెక్కచేయకుండా అండగా నిలుస్తారు.
అయితే, కొందరు వీరి ఈ నిశ్శబ్దాన్ని, మంచితనాన్ని బలహీనతగా అంచనా వేస్తారు. తీపి మాటలతో మభ్యపెట్టి పనులు చక్కబెట్టుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో వృషభ రాశి వారు చాలా విషయాలను మౌనంగా భరిస్తారు. కానీ, ఇదే అదునుగా భావించి కొందరు వీళ్ళను మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి, అవసరమైన చోట ముఖం మీద 'లేదు' అని చెప్పే ధైర్యాన్ని అలవాటు చేసుకోవాలి.
మంచితనం ఎందుకు మోసానికి గురవుతుంది?
ఈ మూడు రాశుల వారు మానవతా దృక్పథంతో వ్యవహరిస్తారు. అవతలి వ్యక్తుల పరిస్థితులను అర్థం చేసుకుని, వారి పొరపాట్లను సైతం పెద్ద మనసుతో క్షమిస్తారు. కానీ, సమాజంలో అందరూ ఒకేలా ఉండరు.
కొందరు ఈ స్వభావాన్ని తమ స్వార్థానికి మెట్లుగా వాడుకుంటారు. నిరంతరం సహాయం పొందినప్పటికీ, బాధ్యతను విస్మరిస్తారు. కాబట్టి, నలుగురిని నమ్మే ముందు కాస్త అప్రమత్తంగా ఉండటం ఈ రాశుల వారికి ఎంతైనా అవసరం.