...
...
Next Story

Sixth Sense: ఈ 3 రాశుల వారికి సిక్స్త్ సెన్స్ ఎక్కువ.. జరగబోయేది ముందే పసిగడతారు!

ప్రతి రాశికి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా కర్కాటక, వృశ్చిక, మీన రాశుల వారికి అంతర్దృష్టి (సిక్స్త్ సెన్స్) ఎక్కువగా ఉంటుందని విశ్వసిస్తారు. జలతత్వానికి చెందిన ఈ రాశుల వారు సూక్ష్మమైన సంకేతాలను త్వరగా గ్రహించడంతో పాటు నిజ స్వభావాన్ని సులభంగా అర్థం చేసుకోగలరని చెబుతారు.

Published on: Jul 4, 2026, 16:00:26 IST
Advertisement

రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. మనకు మొత్తం 12 రాశులు ఉన్నాయి. వీటి ప్రకారం ఏ రాశి వారు ఏ విధంగా ఉంటారనేది తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరి తీరు, ప్రవర్తన మరొకరితో పోల్చుకుంటే కాస్త భిన్నంగానే ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరికీ కూడా ఒక ఇన్నర్ వాయిస్ అనేది ఉంటుంది.

Sixth Sense: ఈ 3 రాశుల వారికి సిక్స్త్ సెన్స్ ఎక్కువ.. జరగబోయేది ముందే పసిగడతారు! (pinterest)
Sixth Sense: ఈ 3 రాశుల వారికి సిక్స్త్ సెన్స్ ఎక్కువ.. జరగబోయేది ముందే పసిగడతారు! (pinterest)

జ్యోతిష్య ప్రకారం కొన్ని రాశుల వారికి అంతర్దృష్టి శక్తి అద్భుతంగా ఉంటుంది. జరగబోయే సంఘటనలను వారు ముందే పసిగట్టగలరు. వారి చుట్టూ ఉన్న వాళ్ల నిజ స్వభావాలను కూడా కొన్ని రాశుల వారు సులువుగా అర్థం చేసుకుంటారు. మంచివారు ఎవరు, వారి వెనుక వెన్నుపోటు ఎవరు పొడుస్తున్నారు వంటి విషయాలను కూడా జాగ్రత్తగా అంచనా వేయగలరు. వీరి దగ్గర అబద్ధం చెప్పడం కూడా సాధ్యం కాని పని. క్షణాల్లో అబద్ధాలను, అబద్ధం చెప్పే వారిని, మోసం చేసే వారిని గుర్తించగలరు. పైగా ఈ రాశుల వారికి సిక్స్త్ సెన్స్ చాలా ఎక్కువ. ఏ విషయమైనా ముందే తెలిసిపోతుంది. మరి వారు ఎవరు? వారిలో మీరు ఒకరేమో చూసుకోండి.

ఈ రాశుల వారికి ఎందుకు సిక్స్త్ సెన్స్ ఎక్కువగా ఉంటుంది?

ఈ మూడు రాశుల వారు సిక్స్త్ సెన్స్‌ను ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశులు జల రాశులు. జలతత్వం సున్నితత్వం, భావోద్వేగాలు, ఆధ్యాత్మిక శక్తితో సంబంధం కలిగి ఉంటుంది. అందుకనే ఈ రాశుల వాళ్లు సూక్ష్మమైన సంకేతాలను ఈజీగా గ్రహిస్తారు. ఇతరుల కంటే కూడా భవిష్యత్తు గురించి ముందుగానే అంచనా వేయగలరు.

1.కర్కాటక రాశి

ఈ రాశి వారికి కూడా సిక్స్త్ సెన్స్ ఎక్కువ. అత్యంత రహస్యమైన రాశుల్లో ఈ రాశి ఒకటి. ఈ రాశి వారు లోతైన ఆలోచనాపరులు. ఇతరుల ఆలోచనలను అర్థం చేసుకునే అద్భుతమైన కళ ఈ రాశి వారికి ఉంది. సిక్స్త్ సెన్స్ ఎక్కువగా ఉండటంతో చాలాసార్లు వీళ్లు ఆధారం లేకుండానే మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తర్వాత ఆ నిర్ణయం సరైనదని నిరూపితమవుతుంది.

3.మీన రాశి

మీన రాశి వారికి కూడా సిక్స్త్ సెన్స్ ఎక్కువ. ఈ రాశికి అధిపతి గురుగ్రహం. జలతత్వానికి చెందిన రాశి ఇది. ఈ రాశి వారు చాలా సున్నితంగా ఉంటారు. ఊహాశక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఏదైనా అనుకుంటే అది చాలా వరకు నిజమవుతుంది. మనసులో వీరికి వచ్చే ఆలోచనలు లేదా కలలు ఇంచుమించుగా నిజమవుతాయి. ఇతరుల ఆలోచనలను, భావాలను వీరు ఈజీగా చదివేస్తారు. వీరి ముందు అబద్ధాలు చెప్పడం ఏమాత్రం పనిచేయదు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe