మేడారం జాతరలో 108 బైక్ అంబులెన్స్‌లు.. భక్తులకు మెడికల్ ఎమర్జెన్సీ సేవలు

మేడారంలో బైక్ అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిద్వారా జాతరలో ఏ ప్రదేశానికైనా వెళ్లవచ్చు. భక్తులకు మందులు కూడా ఇవి అందిస్తాయి.

Published on: Jan 29, 2026, 12:07:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సమ్మక్క-సారలమ్మ మేడారం మహాజాతర దృష్ట్యా భక్తులకు తక్షణ వైద్య సహాయం అందించడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫస్ట్ రెస్పాండర్ 108 బైక్ అంబులెన్స్‌లను మోహరించింది. మేడారం జాతర ప్రాంతంలోని వివిధ కీలక ప్రదేశాలలో మొత్తం 40 ఫస్ట్ రెస్పాండర్ 108 బైక్ అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. రద్దీగా ఉండే ప్రదేశాలకు త్వరగా చేరుకుని, ఆలస్యం లేకుండా వైద్య సహాయం అందించడానికి ఈ బైక్ అంబులెన్స్‌లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

మేడారం జాతరలో బైక్ అంబులెన్స్‌లు
మేడారం జాతరలో బైక్ అంబులెన్స్‌లు

ఈ బైక్ 108 సేవల ద్వారా జ్వరం, తలనొప్పి, వాంతులు లేదా అలసట వంటి చిన్నపాటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న భక్తులకు ప్రథమ చికిత్స, అవసరమైన ప్రాథమిక మందులు అందిస్తున్నారు. ఇందుకోసం కిట్ కూడా ఉంటుంది. బైక్ వెనకాల దానిని సెట్ చేశారు.

అంతేకాకుండా, పరిస్థితి తీవ్రంగా ఉన్న సందర్భాలలో భక్తులను సమీపంలోని ఆసుపత్రులకు తక్షణమే తరలించడానికి వీటిద్వారా ఏర్పాట్లు చేస్తారు. జాతర కాలమంతా ఈ 108 బైక్ సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.

సమర్థవంతంగా సమన్వయం చేసుకుని చర్యలను అమలు చేయడం ద్వారా భక్తులందరి భద్రత, ఆరోగ్య పరిరక్షణను నిర్ధారించడమే తమ ప్రాథమిక లక్ష్యమని జిల్లా యంత్రాంగం చెబుతోంది.

నిరంతం వైద్య సేవలు

మేడారం జాతరకు వచ్చే భక్తులకు నిరంతరం వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. జాతర ప్రాంగణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో 50 మంది ప్రత్యేక వైద్యులు, 150 వైద్య సిబ్బంది, పారామెడికల్ అధికారులు 500, 108 అంబులెన్స్ 40, 108 బైక్ అంబులెన్స్‌లు 40 ఉన్నాయి. ఇతర క్యాంపులు కూడా భక్తులకు సేవలందిస్తున్నాయి. ఎమర్జెన్సీ సేవలు కూడా అందిస్తారు. ఎమర్జెన్సీ కోసం మెుదటి రెఫరల్ ఆసుపత్రి ఏటూరునగరం, రెండో రెఫరల్ ఎంజీఎం వరంగల్ అందుబాటులో ఉంటాయి. అంతేకాదు మేడారం, ఏటూరునాగరం, ములుగు ఆసుపత్రుల్లో ప్రసూతి వైద్యం కూడా అందుబాటులో ఉంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More