...
...
Next Story

తెలంగాణలోని 11 జిల్లాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు.. మరో రెండు రోజులు చలి!

తెలంగాణలోని 11 జిల్లాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆసిఫాబాద్‌లోని తిర్యాణిలో అత్యల్పంగా 6.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Published on: Dec 29, 2025 04:45 PM IST
Advertisement

తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ(TGDPS) డేటా ప్రకారం మొత్తం 11 జిల్లాల్లో ఆదివారం, సోమవారం (డిసెంబర్ 28, 29) ఉదయం మధ్య 10 డిగ్రీలు లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణిలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 6.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

దీని తర్వాత కోహీర్ (సంగారెడ్డి), భీంపూర్ (ఆదిలాబాద్)లో 7.5డిగ్రీలు, మొయినాబాద్ (రంగారెడ్డి)లో 8.2 డిగ్రీలు, యెల్దుర్తి (మెదక్‌లో) 8.4 డిగ్రీలు, మోమిన్‌పేట (వికారాబాద్‌)లో 8.5 డిగ్రీలు, పెంబి (నిర్మల్‌)లో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గంభీరావుపేట (రాజన్న సిరిసిల్ల)లో 9.7 డిగ్రీలు, అక్బర్‌పేట(సిద్దిపేట), ఉప్పల్‌లో (మేడ్చల్‌ మల్కాజిగిరి) 9.8 డిగ్రీలు, సాలూరా (నిజామాబాద్‌), రామగిరి (పెద్దపల్లి)లో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

మిగిలిన 22 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల నుండి 13 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. హైదరాబాద్‌లోని తిరుమలగిరిలో కనిష్ట ఉష్ణోగ్రత 10.7 డిగ్రీలుగా నమోదైంది.

మరోవైపు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తన తాజా బులెటిన్‌లో రాబోయే రెండు రోజుల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల నుండి 3 డిగ్రీల తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.

రాబోయే 24 గంటల పాటు హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో పాక్షికంగా మేఘావృతమైన ఆకాశం ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు లేదా తేలికపాటి పొగమంచు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. రాత్రి వేళల్లో పొగమంచుతో కూడిన వాతావరణం ఉండే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 27 డిగ్రీలు నుంచి 14 డిగ్రీల చుట్టూ ఉండే అవకాశం ఉంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe