తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) బస్ స్టేషన్లను వినోద కేంద్రాలుగా (ఎంటర్‌టైన్‌మెంట్ హబ్స్) మార్చే ప్రణాళికలను ప్రకటించింది. వీటిలో మల్టీప్లెక్స్‌లు కూడా ఉండే అవకాశం ఉంది. ఆర్టీసీ తెలిపిన వివరాల ప్రకారం.. 13 అత్యాధునిక బస్ స్టేషన్లు ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ బస్ స్టేషన్లుగా పనిచేస్తాయి. ఈ విధానం ప్రకారం.. ఆ స్టేషన్ కేవలం రవాణా కేంద్రంగానే కాకుండా, వ్యాపారాలు, వినోదం, ఇతర రవాణా వ్యవస్థల కలయికగా కూడా ఉంటుంది.

ఈ స్టేషన్లలోని సౌకర్యాలు విమానాశ్రయాలను తలపించేలా ఉంటాయని టీజీఎస్ఆర్టీసీ పేర్కొంది. 'తెలంగాణ ప్రభుత్వం సహకారం, టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి వినూత్న ఆలోచనలతో రూపొందించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం, రవాణా శాఖ నుండి ఇప్పటికే అధికారిక ఆమోదం లభించింది.' అని ఆర్టీసీ తెలిపింది.
బస్సు దిగిన వెంటనే ప్రయాణికులకు రైల్వే సేవలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు ఉంటాయని సంస్థ పేర్కొంది. ఈ కాంప్లెక్స్‌లో షాపింగ్ కేంద్రాలు, వ్యాపార కేంద్రాలు కూడా ఉంటాయి. అలాగే గేమింగ్ జోన్‌లు, ఫుడ్ కోర్ట్‌లు, వినోద ప్రాంతాలు కూడా అందుబాటులో ఉంటాయి.
నాగర్‌కర్నూల్, రేగొండ, హుజూర్‌నగర్, కోదాడ, కొడంగల్, కోస్గి, మద్దూరు, కేశముద్రం, హుస్నాబాద్, ములుగు, మధిర, నల్గొండ, కొత్తగూడెం బస్ స్టేషన్లలో ఈ సౌకర్యాలు కల్పించేలా ప్లాన్ చేస్తున్నారు. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికులకు రవాణాను సులభతరం చేయడమే కాకుండా, ఆధునిక సౌకర్యాలు, సరికొత్త అనుభూతిని అందిస్తుంది. రాష్ట్రంలో ఉన్న బస్ స్టేషన్ల రూపరేఖలు మారిపోతాయి. ఈ మోడల్ బస్ స్టేషన్ల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
టీజీఎస్ఆర్టీసీని పునరుద్ధరించడం, టికెట్ల అమ్మకాల ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడం అనే ఆలోచన గత దశాబ్ద కాలంగా పరిశీలనలో ఉంది. 2018లో అప్పటి ప్రభుత్వం టీజీఎస్ఆర్టీసీ ఆస్తులలో మల్టీప్లెక్స్‌లు లేదా థియేటర్లు, షాపింగ్ మాల్స్‌ను ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. అంతకుముందు 2016లోనే.. బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ పద్ధతిలో అనేక బస్ డిపోలలో మినీ-థియేటర్లను ఏర్పాటు చేసే ఆలోచనను కూడా పరిశీలించింది.
{{/usCountry}}టీజీఎస్ఆర్టీసీని పునరుద్ధరించడం, టికెట్ల అమ్మకాల ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడం అనే ఆలోచన గత దశాబ్ద కాలంగా పరిశీలనలో ఉంది. 2018లో అప్పటి ప్రభుత్వం టీజీఎస్ఆర్టీసీ ఆస్తులలో మల్టీప్లెక్స్‌లు లేదా థియేటర్లు, షాపింగ్ మాల్స్‌ను ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. అంతకుముందు 2016లోనే.. బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ పద్ధతిలో అనేక బస్ డిపోలలో మినీ-థియేటర్లను ఏర్పాటు చేసే ఆలోచనను కూడా పరిశీలించింది.
{{/usCountry}}