ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు కొందరు ఏకంగా చనిపోని వ్యక్తిని కాగితాల్లో చంపేశారు. హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగి సర్వీసులో ఉండగానే చనిపోయాడని దొంగ డెత్ సర్టిఫికేట్ సృష్టించి, అతడి కొడుక్కి కారుణ్య నియామకం కింద సర్కారీ కొలువు కొట్టేశారు. నల్గొండ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘరానా మోసాన్ని జిల్లా పోలీసులు ఛేదించారు. మున్సిపల్, వైద్యారోగ్య శాఖల అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు సహా మొత్తం 14 మంది నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
ఆధార్ మార్పు… ఘరానా స్కెచ్

రిటైర్డ్ ఆరోగ్య శాఖ ఉద్యోగి బతికే ఉన్నప్పటికీ, అతడు సర్వీసులో ఉండగానే మరణించినట్లు చూపించేందుకు నిందితులు పెద్ద ప్లాన్ వేశారు. ముందుగా ఆధార్ కార్డులోని చిరునామా వివరాలను మార్చేశారు. ఆ తర్వాత మున్సిపల్, వైద్యారోగ్య శాఖ అధికారులతో చేతులు కలిపి నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని (డెత్ సర్టిఫికేట్) పొందారు. ప్రభుత్వ రికార్డులను సైతం ఫోర్జరీ చేసి, కారుణ్య నియామకాల కోటా కింద ఉద్యోగం పొందేలా బాటలు పరిచారు. ఈ అక్రమ నియామకం వెనుక ఏకంగా రూ. 13 లక్షల డీల్ కుదిరినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
బాధ్యులపై నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు (క్రైమ్ నంబర్ 299/2026) నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS), ఐటీ చట్టం మరియు ఇతర సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 5 లక్షల నగదు, ఒక కంప్యూటర్, ప్రింటర్, 12 మొబైల్ ఫోన్లు, సదరు ఉద్యోగి ఫోటోను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.
నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో…. డీఎస్పీ కే. శివరామ్ రెడ్డి పర్యవేక్షణలో నల్గొండ వన్ టౌన్ పోలీసులు, ఇతర సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఈ మోసాన్ని గుట్టురట్టు చేశారు. ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, జవాబుదారీతనాన్ని కాపాడటంలో రాజీ పడేది లేదని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
{{/usCountry}}నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో…. డీఎస్పీ కే. శివరామ్ రెడ్డి పర్యవేక్షణలో నల్గొండ వన్ టౌన్ పోలీసులు, ఇతర సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఈ మోసాన్ని గుట్టురట్టు చేశారు. ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, జవాబుదారీతనాన్ని కాపాడటంలో రాజీ పడేది లేదని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
{{/usCountry}}