Telangana Police : మావోయిస్టు అగ్రనేత దేవా లొంగుబాటు - అదే బాటలో రాజిరెడ్డి..!

తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ బర్సే సుక్కా అలియాస్‌ దేవా సహా 20 మంది కీలక సభ్యులు లొంగిపోయారు. వీరి నుంచి 48 మౌంటెడ్ LMG ఆయుధాలు, 20 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Published on: Jan 3, 2026, 18:14:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ బర్సే సుక్కా అలియాస్‌ దేవా సహా 20 మంది కీలక సభ్యులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో బర్సే సుక్కా అలియాస్‌ దేవాతో పాటు తెలంగాణా రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్, ఆయన అనుచరులు కూడా ఉన్నారు.

మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టుల లొంగుబాటు

కీలక నేతగా బరిసె దేవా…!

మావోయిస్టు అగ్రనేత హిడ్మా తర్వాత బర్సే సుక్కా అలియాస్‌ దేవా కీలక నేతగా పేరొందారు. గిరిజన వర్గం నుంచి రెండో అతి పెద్ద నాయకుడిగా బరిసె దేవా ఉన్నాడు. 2003లో మావోయిస్టు పార్టీలో చేరిన ఆయన… సైనిక వ్యూహం, పేలుడు పదార్థాలు, తుపాకీలు, ఐఈడీల తయారీలో నిపుణుడిగా రాణించాడు. వ్యూహకర్తగా పార్టీలో మంచి పేరును సంపాదించాడు. ఛత్తీస్గఢ్ మాజీ మంత్రి మహేంద్ర కర్మతో పాటు ఇతర ఘటనల్లో కీలక వ్యక్తిగా ఉన్నాడు.ఆయనపై రూ.75 లక్షల రివార్డు ఉంది. కర్రెగుట్టల్లో గెరిల్లా స్థావరాన్ని స్థాపించటంలో రాజిరెడ్డి కీలక పాత్ర పోషించారు.

లొంగిపోయిన 20 మంది మావోయిస్టులకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సహాయ, పునరావాస విధానంలో భాగంగా మొత్తం రూ .1.82 కోట్ల రివార్డ్ మొత్తాన్ని ఇవ్వనున్నారు. లొంగిపోయిన వారికి గౌరవమైన మరియు భద్రతతో కూడిన జీవితాన్ని పునర్నిర్మించుకోవడానికి వీలు కల్పిస్తామని తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ హామీ ఇచ్చింది.

డీజీపీ కామెంట్స్….

మావోయిస్టు పార్టీకి చెందిన PLGA బెటాలియన్‌ పూర్తిగా క్షీణించిందని డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు “గతంలో 400 మందికి పైగా సభ్యులు ఉండగా..ప్రస్తుతం 66 మంది మాత్రమే ఉన్నారు. నాయకత్వం కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చారు కాబట్టి మిగిలిన వారు ఆలోచించుకోవాలి. వారికి ప్రభుత్వం, పోలీసుశాఖ తరుపున సహకరిస్తాం” అని పిలుపునిచ్చారు.

“అజ్ఞాతం నుంచి జనజీవన స్రవంతిలోకి వచ్చిన 20 మంది మావోయిస్టులు మొత్తం 48 ఆయుధాలతో లొంగిపోయారు. అందులో అత్యాధునిక ఆయుధాలు, తూటాలు, గ్రనైడ్స్‌ ఉన్నాయి.గతేడాది పోలీసు అమరవీరుల స్మృతి దినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపును అందుకొని మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. వారికి ప్రభుత్వం, పోలీసు శాఖ తరుపున పూర్తి సహకారం ఉంటుంది.మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం కేవలం 17 మంది మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఉన్నారు. వారు కూడా లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వస్తే ప్రభుత్వం, పోలీసుశాఖ తరుపున అవసరమైన సహయం అందుతుంది” అని డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More