లేడీస్ గెటప్‌లో ఆర్టీసీ బస్టాండ్‌కు : బుర్ఖా చాటున యువకుడు.. పట్టుకున్న ప్రయాణికులు!
జగిత్యాల జిల్లాలో వింతైన ఘటన వెలుగులోకి వచ్చింది. యువకుడు బుర్ఖా వేసుకుని ఆర్టీసీ బస్టాండ్ వచ్చాడు. అయితే ప్రయాణికులకు అతడి ప్రవర్తన అనుమానం వచ్చింది.
ఫిబ్రవరి 15 ఆదివారం నాడు తెలంగాణలోని జగిత్యాలలోని కోరుట్ల బస్ స్టేషన్‌లో బుర్ఖా, స్కార్ఫ్ ధరించిన మహిళగా పోజులిచ్చిన ఘటనలో ఇద్దరు యువకులపై కేసు నమోదు చేశారు పోలీసులు. కోరుట్ల సబ్-ఇన్స్పెక్టర్ చిరంజీవి ఈ సంఘటనను ధృవీకరించారు. యువకులు ఇన్‌స్టాగ్రామ్ కోసం వీడియోలు చేయడానికి బుర్ఖా ధరించారని చెప్పారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం కోరుట్ల బస్ స్టేషన్‌లో జరిగిందని వెల్లడించారు.

బుర్ఖా ధరించిన యువకుడు మహ్మద్ నుమాన్. అతను తన స్నేహితుడు మహ్మద్ అకీల్‌తో కలిసి ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు చేయడానికి వచ్చాడు. 21 ఏళ్ల నుమాన్ బస్ స్టేషన్‌లోని మహిళల మధ్యలో కూర్చుని ఉండటంతో ప్రయాణికులకు అనుమానం వచ్చింది. వెంటనే అతడిని పట్టుకున్నారు. పురుషుడని తెలిసింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
నుమాన్ గతంలో కూడా అకీల్‌తో కలిసి సోషల్ మీడియా కోసం ఇలాంటి నాలుగైదు వీడియోలు చేసాడని పోలీసులు తెలిపారు. కోరుట్ల మండలంలోని పైడిమడుగు గ్రామంలో నుమాన్ తండ్రికి ఒక హోటల్ ఉంది. ఇద్దరు యువకులపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 292, భారత శిక్షాస్మృతిలోని 290 కింద నాన్-కాగ్నిజబుల్, బెయిలబుల్ నేరం కింద కేసు నమోదు చేశారు. ఇందులో జరిమానా కూడా ఉంటుంది.
నిజానికి మెుదట్లో నుమాన్‌ను ఎవరూ గుర్తించలేదు. కాసేపటి తర్వాత అతడి నడక, ప్రవర్తనలో తేడా గమనించారు. మహిళల మధ్య కూర్చుని చేస్తున్న వింత పనులతో అనుమానం వచ్చింది. పురుషుడని గుర్తించిన తర్వాత ఎందుకు బుర్ఖా వేసుకోవాల్సి వచ్చిందని అడిగారు. ఆ యువకుడు మాత్రం మెుదట్లో సరైన సమాధానం ఇవ్వలేదు. నవ్వుతూ సమాధానాన్ని దాటేశాడు. తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు బండారం బయటపడింది.
తన ఫ్రెండ్ బుర్ఖాలో రమ్మన్నాడని మెుదట్లో నుమాన్ చెప్పుకొచ్చాడు. గట్టిగా అడిగేసరికి అసలు విషయం బయటకు వచ్చింది. రీల్స్ పిచ్చితోనే ఇలాంటి పనులు చేస్తున్నట్టుగా చెప్పాడు. నుమాన్‌కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


