...
...
Next Story

రెట్రో ఫిట్మెంట్‌ కోసం 240 ఆర్టీసీ బస్సులు.. 2027 నాటికి హైదరాబాద్‌లో 2,800 ఎలక్ట్రిక్ బస్సులు!

వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్‌ బస్సులను ఉపయోగించాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు ఆ వైపుగా అడుగులు వేస్తోంది.

Published on: Feb 14, 2026, 06:57:04 IST
Advertisement

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చడం ద్వారా గ్రీన్ మొబిలిటీ వైపు అడుగులు వేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర రవాణా సంస్థ సెప్టెంబర్ 15, 2025న పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చడానికి రెట్రో ఫిట్మెంట్‌ కోసం టెండర్లను పిలిచింది. అందులో భాగంగా కార్పొరేషన్ 200 బస్సులను సాయి గ్రీన్ మొబిలిటీకి, మరో 40 బస్సులను కళ్యాణి పవర్ ట్రైన్ లిమిటెడ్‌కు అప్పగించింది.

తెలంగాణ ఆర్టీసీ
తెలంగాణ ఆర్టీసీ

TGSRTC ప్రకారం 2027 నాటికి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిమితుల్లో 2,800 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారులు. ప్రజా రవాణాపై ఆధారపడటం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల కాలుష్య స్థాయిలు తగ్గుతాయి.

ప్రస్తుతానికి హైదరాబాద్ అంతటా ఆరు డిపోల నుండి 325 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. ఈ సంవత్సరం మరో 175 బస్సులను ఫ్లీట్‌లోకి చేర్చడానికి ప్రణాళికలు రూపొందించారు. 19 అదనపు డిపోలలో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. 10 కొత్త డిపోలు, 10 ఛార్జింగ్ కేంద్రాలకు ప్రణాళికలు రూపొందించారు. ఈ మౌలిక సదుపాయాల ఖర్చు దాదాపు రూ.392 కోట్లుగా అంచనా వేశారు.

అధికారులు ముషీరాబాద్‌లో ఒక పైలట్ ప్రాజెక్టును కూడా రెట్రోఫిట్టింగ్ ఆచరణీయతకు నిదర్శనంగా సూచించారు. 2023లో ముషీరాబాద్ డిపో నుండి ఒక డీజిల్ బస్సును ప్రైవేట్ రంగ సహాయంతో ఎలక్ట్రిక్ బస్సుగా మార్చారు. ఇప్పుడు ఉప్పల్ డిపో పరిమితుల్లో విజయవంతంగా నడుస్తోంది.

టీజీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి హైదరాబాద్ భవిష్యత్తు కోసం ఒక హరిత ప్రయాణం మెుదలైందన్నారు. దానికి మద్దతు ఇవ్వాలని పౌరులకు విజ్ఞప్తి చేశారు. నగర రవాణా వ్యవస్థను పునర్నిర్మించడంలో ప్రజల భాగస్వామ్యం కోసం పిలుపునిచ్చారు. బస్ భవన్‌లో జరిగిన సమావేశంలో టీజీఎస్ఆర్టీసీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, రెట్రోఫిట్టింగ్ సంస్థల ప్రతినిధులు కార్యక్రమం పురోగతిని సమీక్షించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe