ఆ కారణంతో మహిళను కత్తులతో పొడిచి.. ఆపై పూల కుండీతో తల పగలకొట్టి చంపేసిన మాజీ భర్త!

హైదరాబాద్‌లో ఘోరమైన ఘటన జరిగింది. విడాకులు ఇచ్చిందనే కోపంతో మాజీ భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు.

Published on: Feb 18, 2026, 16:03:01 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్‌లో దారుణమైన ఘటన జరిగింది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌ పరిధిలోని గ్రీన్ సిటీ కాలనీలో 30 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ సునీతను ఆమె మాజీ భర్త దారుణంగా హత్య చేశాడు. నిందితుడు మహేష్ రెండు కత్తులు, పెట్రోల్ డబ్బా తీసుకుని సునీత ఇంట్లోకి ప్రవేశించినట్టుగా తెలుస్తోంది. ఆమెపై కత్తులతో దాడి చేసి, తరువాత పూల కుండితో తలపై పగులగొట్టి చంపేశాడు. దీంతో సునీత అక్కడికక్కడే మృతి చెందారు.

సునీత(ఫైల్ ఫొటో)
సునీత(ఫైల్ ఫొటో)

ప్రాథమిక సమాచారం ప్రకారం, సునీత కొన్ని రోజుల క్రితం మహేష్‌కు విడాకులు ఇచ్చింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఏడాది క్రితమే సునీత మహేశ్‌కు విడాకులు ఇచ్చి రెండో వివాహం చేసుకుంది. ఈ విషయంపై కోపం పెంచుకున్న మహేశ్.. ఆమెను హత్య చేశాడు. పారిపోతుండగా.. అతడిని అపార్ట్‌మెంట్ వాసులు పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వివాహితపై పెట్రోల్ పోసి..

మహబూబాబాద్‌‌లోనూ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తనతో పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఓ వ్యక్తి ఘోరమైన ఘటనకు పాల్పడ్డాడు. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడూరు మండలానకి చెందిన ఓ మహిళకు భర్తతో వివాదాలు ఉండటంతో కొన్నేళ్లుగా వేరుగా ఉంటుంది. కూరగాయల వ్యాపారం చేస్తూ జీవిస్తోంది.

మహిళకు అంజయ్య అనే వ్యక్తి పరిచయమయ్యాడు. స్నేహం ఏర్పరచుకున్నాడు. తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. చాలా రోజులుగా వేధిస్తున్నాడు. అయితే తనకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారని ఆ మహిళ అతడికి గట్టిగా చెప్పింది. ఇలాంటివి కుదరవని వివరించింది. ఎన్నిసార్లు చెప్పినా అంజయ్య బుద్ధి మారలేదు. మహిళను ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నాడు. దీంతో భరించలేక హైదరాబాద్ వెళ్లింది.

కొన్ని రోజుల కిందట తిరిగి వచ్చి.. తన తల్లి ఇంట్లో ఉంటుంది. ఇదే విషయం అంజయ్యకు తెలిసింది. మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయాన్ని తెలుసుకున్నాడు. సీసాలో పెట్రోల్ తీసుకువచ్చి.. ఆమెపై పోసి నిప్పంటించాడు. దీంతో అతడికి కూడా మంటలు అంటుకున్నాయి. ఇద్దరికీ తీవ్రంగా గాయాలు అయ్యాయి. స్థానికులు గమనించి.. మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఎంజీఎం వరంగల్‌కు తరలించారు. అంజయ్య పరిస్థితి విషమించి చనిపోయాడు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More