యాసిడ్,పెట్రోల్ బాంబులతో దాడి చేశారు… ఇది హత్యాయత్నం కాదా….? వైఎస్ జగన్

మాజీ మంత్రి జోగి రమేశ్ ను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. ఆయనపై ఇంటిపై జరిగిన దాడికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. పెట్రోల్ దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.

Published on: Feb 6, 2026, 21:52:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంట్లో దాడి జరిగిన ప్రాంతాన్ని వైసీపీ అధినేత జగన్ పరిశీలించారు. జోగి రమేశ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి… ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని… భయపడాల్సిన అవసరం లేదన్నారు. పెట్రోల్ దాడి జరిగిన ప్రదేశాన్ని పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. పెట్రోల్‌ బాంబులతో దాడి చేసిన వీడియోలను జగన్ కు చూపించారు.

మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసంలో వైఎస్ జగన్
మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసంలో వైఎస్ జగన్

ఇది హత్యాయత్నం కాదా..? వైఎస్ జగన్

ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన జగన్… కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అ‍ంబటి ఇంట్లో కొనసాగించిన జంగిల్‌ రాజ్‌ పరంపరను జోగి రమేష్‌ విషయంలో కూడా కొనసాగించారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు జంగిల్ రాజ్ పాలనను చూసి.. నాగరిక ప్రపంచం తలదించుకుంటోందన్నారు. అంబటి రాంబాబు ఇంటిపై సాయంత్రం నుంచి అర్ధరాత్రివరకు దహనకాండను సాగించారని… మరుసటి రోజు జోగి రమేష్ విషయంలోనూ అదే పరంపర కొనసాగిందన్నారు.

“యాసిడ్,పెట్రోల్ బాంబులతో దాడి చేయడంతో.. మంటలకు జోగి రమేశ్ ఇంటి గోడ ఉబ్బింది. ఆ సమయంలో ఇంట్లో లేవలేని స్థితిలో జోగి రమేశ్ తండ్రి ఉన్నారు. ఇంట్లో ఫర్నిచర్, కర్టెన్స్ కి మంటలు అంటుకుని ఉంటే పరిస్థితి ఏంటి..? ఇది హత్యాయత్నం కాదా..?” అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.

చంద్రబాబు అబద్దాలను సీబీఐ సిట్ చార్జిషీట్ తేటతెల్లం చేసింది. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలవలేదు. చంద్రబాబుది అన్యాయమైన ప్రచారం. వెంకటేశ్వర స్వామి ప్రసాదం ప్రతిష్టను దిగజార్చిన వ్యక్తి చంద్రబాబే. వీరు సేకరించిన నమూనాలు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటివే. రాజకీయాల కోసం దేవుడిని వాడుకున్న వ్యక్తి ప్రపంచంలో చంద్రబాబు ఒక్కరే. భూమన, వైవీ సుబ్బారెడ్డి తప్పు చేయలేదని సిట్ నిర్ధారించింది. చంద్రబాబు లెంపలేసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఫ్లెక్సీలతో చంద్రబాబు దుష్ప్రచారాలు చేస్తున్నారు. ప్రశ్నించిన మా నాయకులు అంబటి, జోగి తదితరులపై దాడి చేశారు. అసలు చంద్రబాబు, పవన్, లోకేష్ కు చిప్పే లేదు” అంటూ వైఎస్ జగన్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More