...
...
Next Story

TG Education : డిగ్రీ, పీజీలో 39 స్పెషల్ కోర్సులు - వెంటనే ఉపాధి అవకాశాలు..! ఈ ఏడాది నుంచే అమలు..!

New Education Courses in Telangana :రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం(2026-27) నుంచి డిగ్రీ, పీజీలలో 39 స్పెషల్ కోర్సులు రానున్నాయి.జూన్‌-జులై నాటికి సిలబస్‌ను రూపొందించనున్నారు. ఈ వివరాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ తెలిపారు.

Published on: Mar 18, 2026, 08:24:50 IST
Advertisement

తెలంగాణ యువత కోసం ఉన్నత విద్యామండలి ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఆధునిక సాంకేతికతకు అనుసంధానం చేస్తూ కొత్త కోర్సులు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ‘

ఉన్నత విద్యామండలి కొత్త కోర్సులు
ఉన్నత విద్యామండలి కొత్త కోర్సులు

యూజీ అండ్ పీజీ కోర్సెస్ న్యూ అండ్ ఎమెర్జింగ్ ఏరియాస్’ అనే అంశంపై మంగళవారం టి-సాట్ వేదికగా చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఫ్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి మాట్లాడారు. ప్రతిపాదించే కొత్త కోర్సులకు సంబంధించిన వివరాలు ప్రకటించారు.

ఉపాధి కల్పనే లక్ష్యం - ఫ్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి

తెలంగాణలోని అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం సుమారు 39 కోర్సులకు రూపకల్పన చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ లో భాగమైన 2047 లక్ష్యాన్ని పూర్తి చేసే ప్రయత్నంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా కొత్త కోర్సులను రూపొందించామన్నారు.

అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు 19 కోర్సులు, పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం మరో 10 కోర్సులను తక్షణమే ఉపాధి కల్పించేవిగా ఆచరణలోకి తేబోతున్నామని ప్రకటించారు. ఏఈడీపీ (అప్రెంటిస్ ఎనేబుల్డ్ డిగ్రీ ప్రోగ్రామ్స్)లో భాగంగా మరో 10 కోర్సులు ప్రవేశపెడుతున్నామని స్పష్టం చేశారు.

2030 సంవత్సరానికీ మూడు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి పబ్లిక్ అండ్ ప్రయివేటు భాగస్వామ్యంతో తెలంగాణాలోని వివిధ రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపారు. ఆ ఉద్యోగాలను సాధించేందుకు తెలంగాణ యువతను సిద్ధం చేయాలన్న లక్ష్యంతో ఉన్నత విద్యామండలి పనిచేస్తుందని బాలకిష్టారెడ్డి వివరించారు. కళాశాలల్లో క్యాలిటీ టీచింగ్, మానిటరింగ్, అకడమిక్ పార్టిసిపేషన్, రీసెర్చ్ తదితర అంశాలను తప్పనిసరిగా పాటించాలని ఛైర్మన్ సూచించారు.

వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ ఎస్.కె.మహమూద్ మాట్లాడుతూ…. సైబర్ క్రైమ్, సైబర్ సెక్యూరిటీ, డాటా సైన్స్ వంటి ప్రత్యేక కోర్సులలో విద్యార్థులకు ప్రత్యేక అవకాశాలు కల్పించే ప్రయత్నంలో భాగంగా యూనివర్సిటీలకు, ఆయా కళాశాలకు తగిన సలహాలు-సూచనలు అందిస్తున్నామన్నారు.

కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ మాట్లాడుతూ… యూనివర్సిటీ లేదా కళాశాల తాము నిర్వహించే కోర్సులకు సంబంధించి ఖచ్చితంగా ల్యాబ్స్ నిర్వహించాలని సూచించారు. కొత్త కోర్సులు ప్రారంభించి వదిలివేయడమే కాకుండా వాటిపై తప్పని సరిగా తమ వైపు నుండి ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe