మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు నలుగురు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ అలియాస్ కుమ్మ దాదా, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ జగన్, నూనె నర్సింహారెడ్డి అలియాస్ గంగన్న, సన్ను దాదా లొంగిపోయారు.

తిప్పిరి తిరుపతి 44 సంవత్సరాలు, రాజిరెడ్డి 46 సంవత్సరాలు, దామోదర్ 28 సంవత్సరాలు, నర్సింహ రెడ్డి 36 సంవత్సరాలు అండర్‌గ్రౌండ్‌లో ఉన్నారు. మావోయిస్ట్ టాప్ కమాండర్ దేవ్‌జీ, ఇతర మావోయిస్టు నాయకులు లొంగిపోవాలని తీసుకున్న నిర్ణయాన్ని పోలీసులు సమర్థిస్తున్నారు. మావోయిస్టు పార్టీలో నాయకత్వం, కమిటీలు, సైద్ధాంతిక విభేదాలు, అంతర్గత విభేదాలను ప్రతిబింబిస్తుందని అంటున్నారు.
అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల పట్ల తెలంగాణ పోలీసుల సమగ్రమైన ప్రణాళికను రూపొందించారు. వ్యూహాత్మకంగా లొంగిపోయేలా చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. మావోయిస్టులు లొంగిపోవడానికి తెలంగాణ సేఫ్ ప్లేస్ అనే విధంగా ఓ సందేశాన్ని పంపారు పోలీసులు. దీంతో సాయుధ పోరాటాన్ని విడిచిపెట్టి, తమ కుటుంబాలతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని మావోయిస్టులు లొంగిపోతున్నారు. మారిన పరిస్థితుల కారణంగా ఉద్యమం కొనసాగించలేమని తాజాగా నలుగురు మావోయిస్టు అగ్రనేతలు పార్టీని వీడారు.
2025-2026లో నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు, 15 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, 25 మంది డివిజనల్ కమిటీ కార్యదర్శులు, 63 మంది ఏరియా కమిటీ సభ్యులు, 437 మంది పార్టీ సభ్యులు సహా మొత్తం 544 మంది అజ్ఞాతంలోకి వెళ్లిన మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. ఇది తెలంగాణ పోలీసులు సాధించిన పెద్దగా విజయంగా చెప్పవచ్చు.
మావోయిస్టు పార్టీ కొన్ని సంవత్సరాలుగా కేవలం మిలటరీపైనే ఫోకస్ పెట్టింది. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టలేదని విమర్శ ఉంది. పార్టీ రిక్రూట్మెంట్ కూడా ఆగిపోయింది. జనాల నుంచి మద్దతు కూడా లేదు. అన్ని విషయాల్లో మావోయిస్టులు మెల్ల మెల్లగా ప్రజలకు దూరం అవుతూ వచ్చారు. మావోయిస్టు స్థావరాల్లోకి భద్రతా దళాలు చొచ్చుకుపోవడం, కార్యకర్తలలో సైద్ధాంతిక అసంతృప్తి పెరగడం, అంతర్గత సంఘర్షణలు, అపనమ్మకం, నాయకత్వం విచ్ఛిన్నం కావడం వంటి కారణాల వల్ల మవోయిస్టు పార్టీ పతనం వైపు పయనించింది. తొలి తరం నేతలు ఎన్కౌంటర్లలో చనిపోవడం, ఉన్నవారు వృద్ధాప్య సమస్యలతో బాధపడతూ ఉన్నారు. అనేక కారణాలు మావోయిస్టు పార్టీ చివరి దశకు రావడానికి కారణం అయ్యాయి.
{{/usCountry}}మావోయిస్టు పార్టీ కొన్ని సంవత్సరాలుగా కేవలం మిలటరీపైనే ఫోకస్ పెట్టింది. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టలేదని విమర్శ ఉంది. పార్టీ రిక్రూట్మెంట్ కూడా ఆగిపోయింది. జనాల నుంచి మద్దతు కూడా లేదు. అన్ని విషయాల్లో మావోయిస్టులు మెల్ల మెల్లగా ప్రజలకు దూరం అవుతూ వచ్చారు. మావోయిస్టు స్థావరాల్లోకి భద్రతా దళాలు చొచ్చుకుపోవడం, కార్యకర్తలలో సైద్ధాంతిక అసంతృప్తి పెరగడం, అంతర్గత సంఘర్షణలు, అపనమ్మకం, నాయకత్వం విచ్ఛిన్నం కావడం వంటి కారణాల వల్ల మవోయిస్టు పార్టీ పతనం వైపు పయనించింది. తొలి తరం నేతలు ఎన్కౌంటర్లలో చనిపోవడం, ఉన్నవారు వృద్ధాప్య సమస్యలతో బాధపడతూ ఉన్నారు. అనేక కారణాలు మావోయిస్టు పార్టీ చివరి దశకు రావడానికి కారణం అయ్యాయి.
{{/usCountry}}ఒకప్పుడు కేంద్ర కమిటీలో పదుల సంఖ్యలో మావోలు ఉండేవారు. కానీ రానురాను ఈ సంఖ్య చాలా పరిమితమైపోయింది. 2026 మార్చి 31వ తేదీ నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్రం టార్గెట్ పెట్టుకుంది. ఆ దిశగానే మెుదటి నుంచి ఆపరేషన్ కగార్ విషయంలో అగ్రెసివ్‌గా ముందుకు వెళ్తుంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో భద్రతా బలగాలు నిరంతరం కూంబింగ్ చేస్తున్నాయి. మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి బసవరాజ్‌ను ఎన్‌కౌంటర్‌లో బలగాలు చంపేశాయి. ఆ తర్వాత దేవ్‌జీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కూడా లొంగిపోయారు.
మరోవైపు మావోయిస్ట్ పార్టీ అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ రావు ఆచూకీ తెలిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగాలేదని తెలుస్తోంది. నేపాల్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు. నడవలేని స్థితిలో ఉన్నారు.