వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో రూ. 27 కోట్ల వ్యయంతో జరుగుతున్న ఆధునీకరణ, పునర్నిర్మాణ పనుల పురోగతిని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో కలిసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. తెలంగాణ వ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరచేందుకు, ఆధునీకరించేందుకు భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా వికారాబాద్ స్టేషన్ రూపురేఖలు వేగంగా మారుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో రైల్వే మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మొత్తం 40 రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో పునర్అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా వికారాబాద్, తాండూరు, నాంపల్లి, సికింద్రాబాద్, మౌలాలి, చర్లపల్లి వంటి ప్రధాన రైల్వే స్టేషన్లు సరికొత్త హంగులతో సిద్ధమవుతున్నాయి.
వికారాబాద్ పట్టణం, దాని పరిసర ప్రాంతాల వేగవంతమైన ఎదుగుదలను, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ స్టేషన్‌లో పలు ఆధునిక సదుపాయాలను కల్పిస్తున్నారు. ప్రయాణికులు హాయిగా వేచి ఉండేందుకు అధునాతన వెయిటింగ్ హాళ్లు నిర్మిస్తున్నారు. ప్రయాణికుల కోసం ప్రత్యేక లాంజ్ సదుపాయాలు కూడా ఉన్నాయి. వాహనాల రాకపోకలకు అనువుగా ఆధునిక పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో తెలంగాణ రైల్వే రంగానికి వేల కోట్ల రూపాయల కేటాయింపులు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలోని రైల్వే లైన్ల మార్గాల విద్యుదీకరణ ప్రక్రియ పూర్తి అయిందన్నారు. రైళ్ల రాకపోకల వేగాన్ని పెంచేందుకు డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్ (నాలుగు లైన్ల విస్తరణ) పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నరు.
రైలు ప్రమాదాల నివారణకు స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన అత్యంత సురక్షితమైన కవచ్, కవచ్ 2.0 రక్షణ వ్యవస్థలను తెలంగాణలో తొలిసారిగా అమల్లోకి తెస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా ప్రస్తుతం 5 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు సేవలు అందిస్తూ హైస్పీడ్ కనెక్టివిటీని గణనీయంగా పెంచాయన్నారు.
కాజీపేటలో ఏర్పాటు చేస్తున్న రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం ముగింపు దశకు చేరుకుందన్నారు కిషన్ రెడ్డి. అతిత్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ దీనిని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైతే తెలంగాణలో రైల్వే ఉత్పత్తుల తయారీ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని, స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని పునరుద్ఘాటించారు.
{{/usCountry}}కాజీపేటలో ఏర్పాటు చేస్తున్న రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం ముగింపు దశకు చేరుకుందన్నారు కిషన్ రెడ్డి. అతిత్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ దీనిని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైతే తెలంగాణలో రైల్వే ఉత్పత్తుల తయారీ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని, స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని పునరుద్ఘాటించారు.
{{/usCountry}}హైదరాబాద్ నగరాన్ని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలైన బెంగళూరు, చెన్నై, పుణేలతో అనుసంధానించే బుల్లెట్ రైలు సేవలు భవిష్యత్తులో తెలంగాణ రూపురేఖలను మార్చనున్నాయని కిషన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో పారిశ్రామిక వేగవంతమైన వృద్ధి చెందుతుందన్నారు. అంతర్‌రాష్ట్ర రవాణా, వాణిజ్య బంధాలు మరింత బలపడతాయన్నారు. రాజధాని హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా తెలంగాణ రైల్వే మౌలిక సదుపాయాల రంగాలు సరికొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయని అధికారులు వెల్లడించారు.