Khairatabad Ganesh 2026 : భాగ్యనగరం వేదికగా ఏటా అత్యంత వైభవంగా జరిగే వినాయక చవితి వేడుకలకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఖైరతాబాద్ మహాగణపతి ఈసారి ఏకంగా 69 అడుగుల భారీ ఎత్తుతో భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రతియేటా దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులను ఆకర్శించే ఈ విశిష్ట విగ్రహ తయారీ పనులు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి వెల్లడించింది.
శ్రీ పంచముఖ సంకటహర గణపతిగా దర్శనం

ఈ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతిని 'శ్రీ పంచముఖ సంకటహర గణపతి' రూపంలో తీర్చిదిద్దారు. భక్తుల కష్టాలను తీర్చి, సమస్త విఘ్నాలను తొలగించే ఈ అవతారం సిద్ధం చేయడానికి కళాకారులు అహోరాత్రులు శ్రమించారు. ఈ భారీ విగ్రహ రూపుకల్పన వెనుక సుమారు 150 మంది నైపుణ్యం కలిగిన మూర్తి కళాకారుల అపార శ్రమ దాగి ఉంది. తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర ఐదు విభిన్న రాష్ట్రాల నుంచి వచ్చిన శిల్పులు కలసికట్టుగా పనిచేసి ఈ ప్రతిమను అద్భుతమైన కళాఖండంగా మలిచారు.
తొలి పూజకు గవర్నర్‌కు ఆహ్వానం
ఉత్సవాల ప్రారంభం సందర్భంగా నిర్వహించే తొలి పూజ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ను అధికారికంగా ఆహ్వానించినట్లు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఛైర్మన్ రాజు కుమార్ తెలిపారు. ఆదివారం నాటికి విగ్రహానికి అమర్చిన తోడ్పాటు సహాయక కర్రలను (సపోర్టింగ్ స్టిక్స్) విడతల వారీగా తొలగించి…. పూర్తిస్థాయిలో భక్తుల సందర్శనార్థం విగ్రహాన్ని అందుబాటులోకి తెస్తామని ఆయన పేర్కొన్నారు.
ముందస్తుగా శుక్రవారం రోజు నిర్వహించిన 'ఆగమన్' కార్యక్రమానికి భక్తుల నుంచి అనూహ్య స్పందన లభించింది. సుమారు 10 వేల మందికి పైగా భక్తులు ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని గణనాథుడి పట్ల తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు.మేళతాళాలు, నృత్యాలతో గణనాథుడికి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం రక్షణ దృష్ట్యా కర్రల చాటున ఉన్న ఈ విగ్రహం….. రేపటి(సెప్టెంబర్ 13) నుంచి పూర్తి వైభవంతో భక్తులకు కంటిపాపలా దర్శనమివ్వనుంది.
పది రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు
సిద్ధి, బుద్ధి, జ్ఞానానికి అధిపతి అయిన విఘ్నేశ్వరుడి జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే ఈ వినాయక చవితి పండుగ పది రోజుల పాటు ఎంతో భక్తిశ్రద్ధలతో సాగుతుంది. ఇళ్లలో, సార్వజనిక మండపాల్లో గణపతి విగ్రహాలను ప్రతిష్టించి పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పది రోజుల పండగ అనంతరం నదీ జలాల్లో విగ్రహ నిమజ్జనంతో ఈ ఆధ్యాత్మిక సంబరాలు ముగుస్తాయి. తెలంగాణలోనే అతి పెద్ద విగ్రహంగా పేరొందిన ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు ఈ పది రోజుల్లో లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు.
{{/usCountry}}సిద్ధి, బుద్ధి, జ్ఞానానికి అధిపతి అయిన విఘ్నేశ్వరుడి జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే ఈ వినాయక చవితి పండుగ పది రోజుల పాటు ఎంతో భక్తిశ్రద్ధలతో సాగుతుంది. ఇళ్లలో, సార్వజనిక మండపాల్లో గణపతి విగ్రహాలను ప్రతిష్టించి పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పది రోజుల పండగ అనంతరం నదీ జలాల్లో విగ్రహ నిమజ్జనంతో ఈ ఆధ్యాత్మిక సంబరాలు ముగుస్తాయి. తెలంగాణలోనే అతి పెద్ద విగ్రహంగా పేరొందిన ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు ఈ పది రోజుల్లో లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు.
{{/usCountry}}