...
...
Next Story

890 గ్రామల్లో ఏకగ్రీవం.., తొలి విడత పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశాం : ఎస్ఈసీ

మొదటి దశ పోలింగ్‌కు ముందే తెలంగాణలోని 890 గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం అయ్యాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. తొలి విడత పోలింగ్‌ ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు.

Published on: Dec 10, 2025, 17:01:34 IST
Advertisement

గురువారం జరిగే పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు. పోలింగ్ సజావుగా జరిగేలా పోలీసు శాఖ భద్రత, శాంతిభద్రతల చర్యలను చేపట్టిందని అన్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. మొదటి దశలో 395 గ్రామాలు, రెండో దశలో 495 గ్రామాలు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలియజేసింది.

రాష్ట్ర ఎన్నికల సంఘం
రాష్ట్ర ఎన్నికల సంఘం

ఇప్పటివరకు అధికారులు తనిఖీల సమయంలో రూ.8.2 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 50,000 మంది సివిల్ పోలీసు సిబ్బంది విధుల్లో ఉంటారని, భద్రతను పటిష్టం చేయడానికి బయటి నుండి 60 ప్లాటూన్లను రప్పించామని ఎస్ఈసీ రాణి కుముదిని తెలిపారు.

మెుదటి దశ గ్రామ పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం చేసినట్టుగా ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు. 'తొలి దశలో 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లతో ఈ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. ప్రతీ పోలింగ్ స్టేషన్ వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేశాం. ఈ ఎన్నికల్లో విధుల్లో లక్ష మందికిపైగా సిబ్బంది పాల్గొంటారు.' అని ఎస్ఈసీ రాణి కుముదిని పేర్కొన్నారు.

మెుదటి విడత ఎన్నికల్లో భాగంగా 4236 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో 395 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే ఇందులో 5 స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. గురువారం 3846 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరుగుతుంది. మెుత్తం 13,127 మంది సర్పంచ్ అభ్యర్థులో తొలి విడత పోరులో బరిలో ఉన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe