జీహెచ్ఎంసీ సూపర్ ఆఫర్.. వన్‌టైమ్ సెటిల్‌మెంట్.. 90 శాతం మాఫీ

జీహెచ్ఎంసీ పరిధిలో మెుండి బకాయిలు ఉన్న ఆస్తి పన్నుల చెల్లింపుదారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వన్ టైమ్ సెటిల్‌మెంట్ అవకాశాన్ని కల్పిస్తుంది.

Published on: Dec 23, 2025, 10:03:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలోని మెుండి బకాయిలు ఉన్న ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రత్యేక రాయితీని ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి హైదరాబాద్‌లో బకాయి ఉన్న ఆస్తి పన్నులపై వడ్డీలో 90 శాతం మాఫీని అందించే వన్ టైమ్ సెటిల్‌మెంట్ (OTS) పథకాన్ని ప్రకటించింది. పన్ను చెల్లింపుదారుడు అసలు మొత్తాన్ని, 10 శాతం వడ్డీని ఒకేసారి చెల్లించినట్లయితే ఇది వర్తిస్తుంది.

జీహెచ్ఎంసీ
జీహెచ్ఎంసీ

గ్రేటర్ హైదరాబాద్‌ పరిమితుల్లోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులకు ఇది వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు సంబంధించి ఓటీఎస్ కింద మెుండి బకాయిలన్నీ ఒకేసారి చెల్లిస్తే వడ్డీపై 90 శాతం రాయితీ ఇవ్వనున్నట్టుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిని అమలు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు.

కొన్ని రోజుల కిందటే హైదరాబాద్ పరిధిని ప్రభుత్వం భారీగా విస్తరించింది. ఓఆర్ఆర్‌ను ఆనుకొని ఉన్న 20 పురపాలక సంఘాలు, ఏడు నగరపాలక సంస్థలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసింది. ఈ విలీనంతో బృహత్ నగరంగా హైదరాబాద్‌ అవతరించింది. కొత్త ప్రాంతాలకు కూడా ప్రాపర్టీ ట్యాక్స్ ఆఫర్ వర్తిస్తుంది. దీనితో ప్రజలపై ఉన్న వడ్డీ భారం తగ్గనుంది. అంతేకాదు జీహెచ్ఎంసీకి భారీగా ఆదాయం సమకూరనుంది.

ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు ఈ ఆఫర్ వర్తించనుందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. జీహెచ్ఎంసీ విస్తరణ ప్రక్రియను చాలా వేగవంతంగా చేసింది ప్రభుత్వం. విస్తరణకు నవంబర్ 25న మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ చట్టాన్ని రూపొందించగా.. గవర్నర్ వెంటనే ఆమోదం తెలిపారు. డిసెంబర్ 15వ తేదీన 27 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనమైనట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. గతంలోని 150 కార్పొరేట్ స్థానాల సంఖ్య.. 300కు పెంచుతూ.. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More