హైదరాబాద్ నగరంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఐటీ కారిడార్‌తో పాటు పాతబస్తీ, నగరంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో హఠాత్తుగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆఫీసుల వేళలు ముగిసి ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యే సమయంలో వర్షం ప్రారంభం కావడంతో ఉద్యోగులు, వాహనదారులు, సామాన్య ప్రజలు రోడ్లపై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం

ఐటీ హబ్ పరిధిలోని మణికొండ, నానక్‌రాంగూడ, రాయదుర్గం, షేక్‌పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసుఫ్‌గూడా, వెంగళరావునగర్ ప్రాంతాల్లో దాదాపు గంటకు పైగా వర్షం దంచి కొట్టింది. అలాగే టోలిచౌకి, లంగర్‌హౌస్, కార్వాన్, రాజేంద్రనగర్, పాతబస్తీ ప్రాంతాలతో పాటు నగర శివార్లలోని తుర్కయంజాల్, మన్నెగూడ, రాగన్నగూడ, కాప్రా, కీసర, నాగారం పరిసరాల్లో కూడా భారీ వర్షపాతం నమోదైంది.
ఆకస్మిక వర్షం ధాటికి నగరంలోని పలు కీలక జంక్షన్ల వద్ద రహదారులు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో నగర ట్రాఫిక్ పోలీసులు మరియు హైడ్రా సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. పలు కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు మరియు మార్గదర్శకాలను జారీ చేశారు:
- మలక్‌పేట్‌లోని అక్షయ హోటల్ సమీపంలో రోడ్డుపై భారీగా నీరు చేరింది. దీంతో చార్మినార్, మలక్‌పేట్ వైపు నుంచి నల్గొండ క్రాస్ రోడ్స్ వైపు వెళ్లే వాహనాల రాకపోకలు అత్యంత నెమ్మదిగా సాగుతున్నాయి. మలక్‌పేట్ ట్రాఫిక్ సిబ్బంది అక్కడే ఉండి నీటిని తొలగించడంతో పాటు వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు. ప్రయాణికులు జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు.
- పురానాపూల్ శ్మశానవాటిక సమీపంలో భారీగా వరద నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది. నీటిని వేగంగా తోడిపోసేందుకు 'హైడ్రా' బృందాలు వాటర్ మోటార్ పంపులను ఉపయోగించి నీటిని ఖాళీ చేస్తున్నాయి. ఫలక్‌నుమా ట్రాఫిక్ పోలీసులు స్థానికంగా ఉండి వాహనదారులకు సహాయం చేస్తున్నారు.
- బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10, రోడ్ నంబర్ 12 నుంచి వచ్చే వాహనదారులు కేబీఆర్ పార్క్ వన్-వే రూట్‌ను నివారించాలని పోలీసులు స్పష్టం చేశారు. అగ్రెసేన్ ఐలాండ్, తాజ్‌మహల్ యు-టర్న్, భారతీయ విద్యాభవన్ , జర్నలిస్ట్ కాలనీ మార్గాల్లో నిలిచిన నీటి కారణంగా ట్రాఫిక్ స్తంభించింది. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కోరారు.
వర్షం కారణంగా రోడ్లు జారేలా ఉండటం, వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు నెమ్మదిగా, అప్రమత్తంగా ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
{{/usCountry}}వర్షం కారణంగా రోడ్లు జారేలా ఉండటం, వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు నెమ్మదిగా, అప్రమత్తంగా ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
{{/usCountry}}ఇక సిటీలో దాదాపు రెండు గంటలకుపైగా వర్షం కురుస్తోంది. ఈ వర్షాకాలంలో ఏకధాటిగా ఎప్పుడూ ఈస్థాయి వర్షం కురవలేదు. ఈ ఏడాదిలో సిటీకి ఇదే అత్యధిక వ్యవధి పాటు అని అధికారులు చెబుతున్నారు. ఈ వర్షాకాలంలో సిటీలో కేవలం ఐదు సార్లు మాత్రమే భారీ వర్షం నమోదైన సంగతి తెలిసిందే.