Sunkari Narahari Rao ACB Case : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ (మల్టీ జోన్-2) డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి రావుకు సంబంధించిన అక్రమ సంపాదన ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఈ దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ శాలిబండలోని కెనరా బ్యాంక్ శాఖలో ఉన్న నరహరి రావు వ్యక్తిగత లాకర్‌ను ఏసీబీ అధికారులు శనివారం తెరిచారు. ఈ సోదాల్లో లాకర్‌లో గుట్టలుగా దాచిన రూ.1.50 కోట్ల నగదును చూసి అధికారులు సైతం విస్మయానికి గురయ్యారు. ఆ డబ్బు మొత్తాన్ని స్వాధీనం చేసుకుని లెక్కింపు పూర్తి చేశారు.
ఇటీవలే సోదాలు…

సుంకరి నరహరి రావుపై వచ్చిన అవినీతి ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ అధికారులు గత కొన్ని రోజులుగా నిఘా పెట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో ఆయన ఇళ్లు, కార్యాలయాలపై ఇటీవలే ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో ఇప్పటివరకు లభించిన ప్రభుత్వ రికార్డుల విలువ ప్రకారమే రూ.13.05 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు అటాచ్ చేశారు. అయితే బహిరంగ మార్కెట్లో వీటి విలువ దాదాపు రూ.200 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నరహరి రావు అక్రమంగా సంపాదించిన సొమ్ముతో పెద్ద ఎత్తున స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.
ఏసీబీ స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ప్రకారం….. నిందితుడి పేరిట 1.24 ఎకరాల వ్యవసాయ భూమి, నాలుగు విలాసవంతమైన ఫ్లాట్లు, రెండు బహుళ అంతస్తుల భవనాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ సర్వీసులో ఉంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడి కోట్లాది రూపాయల అవినీతి సొమ్మును వెనకేసినట్లు ఆధారాలు లభించడంతో ఏసీబీ ఆయనను అరెస్ట్ చేసింది. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం నిందితుడికి 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
ప్రస్తుతం నరహరి రావు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కాగా… ఆయనకు సంబంధించిన ఇతర బ్యాంక్ ఖాతాలు, బినామీల పేరిట ఉన్న ఆస్తులపై ఏసీబీ అధికారులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.
{{/usCountry}}ప్రస్తుతం నరహరి రావు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కాగా… ఆయనకు సంబంధించిన ఇతర బ్యాంక్ ఖాతాలు, బినామీల పేరిట ఉన్న ఆస్తులపై ఏసీబీ అధికారులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.
{{/usCountry}}