ఎండలు ముదరనే లేదు. అప్పుడే తాగునీటి సమస్యలు మెుదలయ్యేలా కనిపిస్తున్నాయి. నీటి ఎద్దడి ముంచుకొస్తున్నది. చాలా ప్రాంతాల్లో నీటి సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక మే నెలలో పరిస్థితుల ఎలా ఉంటాయోనని జనాలు ఇప్పటికే భయపడుతున్నారు.

తాగునీటి వనరులు ఎండిపోతున్న నేపథ్యంలో గృహాలకు నీటి సరఫరాను మెరుగుపరిచేందుకు ప్రస్తుత నీటి ట్యాంకుల ప్రదేశాలలో బోర్‌వెల్స్ తవ్వడానికి ఆదిలాబాద్ మున్సిపాలిటీ సిద్ధమవుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో నీటి వనరులు అడుగంటిపోవడంతో మున్సిపాలిటీలో నీటి పంపిణీలో ఇబ్బందులు ఉన్నట్టుగా అధికారులు తెలిపారు.
మున్సిపాలిటీకి తాగునీటి సరఫరా కోసం నీటిని నిల్వ చేయడానికి, పంప్ హౌస్ సమీపంలోని లాండసాంగ్వి వాగుపై చెక్ డ్యామ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 6 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న పంప్ హౌస్ వద్ద పంపింగ్ సామర్థ్యం తక్కువగా ఉందని, డిమాండ్‌ను తీర్చడానికి దానిని పెంచాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు.
వేసవి ఉష్ణోగ్రతలు పెరగడం, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా గ్రామాల్లో కూడా నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా చనాకా-కొరాటా నుంచి ప్రత్యామ్నాయ తాగునీటి సరఫరా పథకం కోసం రూ. 54 కోట్లు కోరుతూ మున్సిపాలిటీ ఒక ప్రతిపాదనను సమర్పించింది. ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నారు. ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది నాటికి పూర్తయి, కార్యరూపం దాల్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ప్రతిపాదిత ప్రణాళికలో భాగంగా, చనాకా-కొరాటా బ్యారేజీ నుండి పురపాలక సంఘం వరకు 17 కిలోమీటర్ల పైప్‌లైన్‌ను వేయనున్నారు. నీటిమట్టాలు పడిపోవడం వల్ల ఎస్ఆర్ఎస్పీ నుండి మిషన్ భగీరథ కింద నీటి సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడి, పంపిణీపై మరింత ప్రభావం పడుతోంది.
ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్ బండరి అనూష మాట్లాడుతూ.. 49 కాలనీలలోని గృహాలకు నీటిని తోడి సరఫరా చేసేందుకు, కాలనీలలో గుర్తించిన నీటి ట్యాంకుల సమీపంలో ఒక్కొక్కటి చొప్పున సుమారు 30 బోర్‌వెల్స్‌ను తవ్వాలని మున్సిపాలిటీ ఆలోచిస్తున్నట్టుగా ప్రకటించారు. తక్షణ కొరతను తీర్చడానికి రెండు రోజుల్లో బోర్వెల్ పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
{{/usCountry}}ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్ బండరి అనూష మాట్లాడుతూ.. 49 కాలనీలలోని గృహాలకు నీటిని తోడి సరఫరా చేసేందుకు, కాలనీలలో గుర్తించిన నీటి ట్యాంకుల సమీపంలో ఒక్కొక్కటి చొప్పున సుమారు 30 బోర్‌వెల్స్‌ను తవ్వాలని మున్సిపాలిటీ ఆలోచిస్తున్నట్టుగా ప్రకటించారు. తక్షణ కొరతను తీర్చడానికి రెండు రోజుల్లో బోర్వెల్ పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
{{/usCountry}}