...
...
Next Story

Ginger Garlic Paste : హైదరాబాద్‌లో భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ.. 4 టన్నులకు పైగా సీజ్!

Ginger Garlic Paste : హైదరాబాద్‌లో భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ జరుగుతోంది. అధికారులు చేసిన దాడిలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Published on: Mar 31, 2026 01:46 PM IST
Advertisement

హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అధికారులు.. హెచ్-ఫాస్ట్ బృందంతో కలిసి కాటేడాన్‌లో ఎస్‌కేఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అపరిశుభ్రమైన పరిస్థితుల్లో అల్లం పేస్ట్ తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ మేరకు ఆహార కల్తీ దందాను అధికారులు ఛేదించారు. నాలుగు టన్నులకు పైగా కలుషితమైన అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నాసిరకం ముడిసరుకులతో అపరిశుభ్రమైన ఉత్పత్తులను తయారు చేసి, వాటిని రెస్టారెంట్లు, టోకు వ్యాపారులకు సరఫరా చేస్తున్న యూనిట్ యజమానిని అరెస్టు చేశారు.

కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ సీజ్
కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ సీజ్

ఇక్కడి నుంచి నగరంలోని రెస్టారెంట్లు, టోకు వ్యాపారులకు కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను సరఫరా చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. కాటేడాన్‌లోని ఒక తయారీ యూనిట్‌పై అధికారులు దాడి చేయగా.. 4 టన్నుల (4,032 కేజీల) అల్లం-వెల్లుల్లి పేస్ట్‌తో పాటు, 6,200 కేజీలకు పైగా నాసిరకం ముడి పదార్థాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ. 22 లక్షలు ఉంటుంది.

టాస్క్ ఫోర్స్(ఖైరతాబాద్) దర్యాప్తు బృందాలు.. హెచ్-ఫాస్ట్ బృందంతో కలిసి తయారీ యూనిట్ యజమాని హసన్ అలీ రూపానీని అరెస్టు చేశాయి. తనిఖీ సమయంలో వెల్లుల్లి తొక్కలు వంటి నాసిరకం ముడి పదార్థాలతో పాటు, ఎసిటిక్ యాసిడ్, ఇతర రసాయన పదార్థాలను గుర్తించారు. అపరిశుభ్రమైన పరిస్థితులలో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు.

ఆ ఉత్పత్తులను దుమ్ము.. ఈగలకు వాలేలా తెరిచిన డబ్బాలలో నిల్వ ఉంచారు. సరైన ఆహార భద్రతా ప్రమాణాలు పాటించకుండా ప్యాక్ చేశారని తెలుస్తోంది. నగరవ్యాప్తంగా ఉన్న హోల్‌సేల్ కిరాణా దుకాణాలు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సేవలకు ఈ కల్తీ పేస్ట్‌ను సరఫరా చేస్తున్నారని పోలీసు అధికారులు తెలిపారు.

ఇలాంటి కల్తీ చేసిన ఉత్పత్తిని టోకు దుకాణాలకు, ఆహార క్యాటరింగ్ సేవలకు సరఫరా చేయడం ద్వారా ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పు వాటిల్లుతోందని అధికారులు అన్నారు. ఆర్థిక లాభం కోసం చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నారని టాస్క్ ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe