Hyderabad Task Force : టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు - భారీగా కల్తీ అల్లం పేస్ట్ సీజ్..! వెలుగులోకి కీలక విషయాలు

హైదరాబాద్ లో కల్తీ ఆహార తయారీ కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపారు.  లాలాగూడ పరిధిలో నిర్వహిస్తున్న కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రాన్నిరట్టు చేశారు. సుమారు 1915 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను 18 ప్లాస్టిక్ టబ్బులలో నిల్వ ఉంచగా పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

Published on: Mar 7, 2026, 18:10:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రాణాంతక రసాయనాలతో అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న భారీ నెట్‌వర్క్‌ను సికింద్రాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ మరియు లాల్లాగూడ పోలీసులు శనివారం రట్టు చేశారు.ఈ దాడిలో తయారీదారులతో పాటు భారీగా ఉన్న కల్తీ అల్లం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.

కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్
కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్

లాలపేటలోని జనప్రియ అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఝాన్సీ అల్లం వెల్లుల్లి పేస్ట్ గోడౌన్‌పై టాస్క్ ఫోర్స్ టీమ్ ఆకస్మిక దాడి నిర్వహించింది. ఈ తనిఖీల్లో నాణ్యత లేని ముడి పదార్థాలతో పాటు ప్రమాదకరమైన రసాయనాలను కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించింది. ఈ కేంద్రాన్ని నడుపుతున్న నీలా వెంకటేశ్వర్లుతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు.

అత్యంత హానికరమైన ఎసిటిక్ యాసిడ్, శాంతన్ గమ్ వంటి కెమికల్స్‌ను అల్లం-వెల్లుల్లి మిశ్రమంలో కలిపి తయారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆకర్షణీయమైన నకిలీ బ్రాండ్ లేబుల్స్‌తో నగరంలోని కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది.

ఈ మెరుపు దాడుల్లో పోలీసులు ఏకంగా 1,915 కిలోల కల్తీ పేస్ట్‌తో పాటు తయారీకి వాడే యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 318(4), 275, 223 కింద కఠిన కేసులు నమోదు చేశారు.

అపరిశుభ్రమైన వాతావరణంలో…. కుళ్లిన ముడి పదార్థాలతో తయారయ్యే ఇటువంటి కల్తీ పదార్థాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.

స్వాధీనం చేసుకున్న వస్తువులు:

  • ప్లాస్టిక్ టబ్బుల్లో (ప్యాక్ చేయని) అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 18 టబ్బులు (ప్రతి టబ్ 45 కిలోలు)
  • అసిటిక్ యాసిడ్ – 30 కిలోలు
  • జాంతన్ గమ్ – సగం ఉపయోగించిన సంచి (సుమారు 10 కిలోలు)
  • 5 కిలోల ప్లాస్టిక్ బాక్స్‌లలో పేస్ట్ – 80 బాక్స్‌లు
  • 1 కిలో బాక్స్‌లు – 300
  • 500 గ్రాముల బాక్స్‌లు – 370
  • 175 గ్రాముల బాక్స్‌లు – 1320
  • గ్రైండర్/మిక్సింగ్ మెషిన్ – 1
  • వెయింగ్ మెషిన్ – 1
  • ముడి అల్లం మరియు వెల్లుల్లి – 80 కిలోలు
  • డేట్ స్టాంపులు – 4
  • “Jansi-M” అనే నకిలీ లేబుళ్లు – 86
  • ప్యాకింగ్ మెషీన్లు – 2
  • మొత్తం స్వాధీనం చేసిన అల్లం–వెల్లుల్లి పేస్ట్ - 1915 కిలోలు
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More