భాగ్యనగరంలో ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే మృగశిర కార్తె చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ (నుమాయిష్ మైదానం) వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా లక్షలాది మంది తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నగరంలో ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నాంపల్లి పరిసర ప్రాంతాల్లో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధిస్తున్నట్లు ప్రకటించారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం (జూన్ 8) ఉదయం 6 గంటల నుంచి మంగళవారం (జూన్ 9) రాత్రి 8 గంటల వరకు ఈ ట్రాఫిక్ మళ్లింపులు నిరంతరాయంగా అమలులో ఉంటాయి. చేప ప్రసాదం కోసం వచ్చే భక్తులు, సాధారణ వాహనదారులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా పోలీసులు ఈ క్రింది విధంగా రూట్ మ్యాప్ కేటాయించారు.
ఆర్టీసీ బస్సులు, భారీ వ్యాన్లు: బస్సులు లేదా పెద్ద వ్యాన్లలో ప్రయాణించే వారు గాంధీభవన్ లేదా గృహకల్ప బస్టాప్‌ల మార్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఆటో ప్రయాణికులు: ఆటోల్లో వచ్చే భక్తుల కోసం పోలీసులు నాంపల్లిలోని షెజాన్ హోటల్ వద్ద ప్రత్యేక అలైటింగ్ పాయింట్ (దిగే స్థలం) ఏర్పాటు చేశారు. ప్రయాణికులను అక్కడ దించి ఆటోలు వెంటనే వెనుతిరగాల్సి ఉంటుంది.
సాధారణ వాహనదారులు: నాంపల్లి, మోజాంజాహీ మార్కెట్, అబిడ్స్, అసెంబ్లీ పరిసర ప్రాంతాల గుండా ప్రయాణించే సాధారణ వాహనదారులు ట్రాఫిక్ ఇరుక్కుపోకుండా ఉండేందుకు ముందస్తుగానే ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఏటా మృగశిర కార్తె ప్రవేశించే రోజున బత్తిన కుటుంబం ఆధ్వర్యంలో ఈ ఉచిత చేప ప్రసాదం పంపిణీ జరుగుతుంది. శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా వ్యాధితో బాధపడేవారికి ఇది ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ మెట్రో రైల్ ప్రత్యేక సర్వీసులను నడపనుంది. నాంపల్లి మెట్రో స్టేషన్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు అత్యంత సమీపంలో ఉండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు పడకూడదనుకునే వారు మెట్రో మార్గాన్ని ఎంచుకోవడం ఉత్తమం. ఆర్టీసీ కూడా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
{{/usCountry}}భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ మెట్రో రైల్ ప్రత్యేక సర్వీసులను నడపనుంది. నాంపల్లి మెట్రో స్టేషన్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు అత్యంత సమీపంలో ఉండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు పడకూడదనుకునే వారు మెట్రో మార్గాన్ని ఎంచుకోవడం ఉత్తమం. ఆర్టీసీ కూడా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
{{/usCountry}}ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పరిసరాల్లో వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై వాహనాలు నిలిపితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.
అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అంబులెన్సులు, తగినన్ని మందులతో కూడిన వైద్య శిబిరాలను సిద్ధం చేయాలని అధికారులు ఆదేశించారు. ముఖ్యంగా క్యూలైన్ల మధ్యలో సీపీఆర్ నిర్వహించగల ప్రత్యేక వైద్య బృందాలను అందుబాటులో ఉంచుతారు. గ్రౌండ్స్ అంతటా సమాచారం స్పష్టంగా వినిపించేలా క్లియర్ ఆడియోతో కూడిన మైకులను అమర్చారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఉన్న కంట్రోల్ రూమ్, ప్రత్యేక వాట్సప్ గ్రూపుల ద్వారా అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుంటూ పంపిణీ ముగిసే వరకు అప్రమత్తంగా ఉంటారు.