తెలంగాణలో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వాహనదారులపై పోలీస్, రవాణా శాఖలు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో పెండింగ్ ట్రాఫిక్ చలానాల రూపంలో వాహనదారులు ప్రభుత్వానికి దాదాపు రూ.1,930 కోట్లు బకాయి పడ్డారు. జూన్ 1 నాటికి పోలీస్ శాఖ విధించిన చలానాల సంఖ్య 5,34,53,337కు చేరగా.. వీటి మొత్తం విలువ రూ.19,26,08,22,750 గా ఉంది. రవాణా శాఖ రికార్డు చేసిన ఉల్లంఘనల పెండింగ్ జరిమానాలు రూ.3.07 కోట్లుగా ఉన్నాయి.

వాహనదారులకు ఎస్ఎంఎస్, వాట్సాప్, లేదా ఈమెయిల్ ద్వారా పంపే ట్రాఫిక్ చలానాల సమాచారాన్ని అధికారిక కమ్యూనికేషన్‌గా గుర్తిస్తూ రవాణా శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందేశం అందిన వెంటనే వాహనదారుడికి సమాచారం చేరినట్లుగానే భావిస్తారు.
రవాణా శాఖ జూన్ 1న జారీ చేసిన జీవో నెం. 25 ప్రకారం.. వాహనదారులందరూ తమ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీని 30 రోజుల్లోగా 'వాహన్' పోర్టల్ (http://vahan.parivahan.gov.in) లో తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలి. ఈ గడువు ముగిసిన తర్వాత, వాహన్ పోర్టల్‌లో నమోదైన మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్‌కు ఎస్ఎంఎస్, వాట్సాప్ లేదా ఈమెయిల్ ద్వారా పంపే ఏ చలానైనా వాహనదారుడికి చేరినట్లుగానే పరిగణిస్తామని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.
వాహనదారులందరూ తమ కాంటాక్ట్ వివరాలను వాహన్ పోర్టల్‌లో అప్‌డేట్ చేయడం ఇకపై విధిగా మారుతుంది. వచ్చే నెల నుండి ఇది ఒక ఏకీకృత ట్రాకింగ్ సిస్టమ్ (Unified Tracking System) లా పనిచేస్తుంది. చలానాను పోలీసులు జారీ చేసినా, లేదా రవాణా శాఖ జారీ చేసినా ప్రక్రియ మొత్తం సులభతరం అవుతుంది. వాహనదారుడికి మెసేజ్ వెళ్లిన వెంటనే, సదరు వ్యక్తికి సమాచారం అందిందని, దాన్ని వారు అర్థం చేసుకున్నారని, జరిమానా చెల్లించడానికి కట్టుబడి ఉన్నారని భావిస్తారు.
తాజా ఉత్తర్వులతో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన చలానాలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో పంపే విధానం తక్షణమే అమల్లోకి వచ్చింది. ఇకపై డిజిటల్ రూపంలో వచ్చే చలానాలే అధికారికం కానున్నాయి.
{{/usCountry}}తాజా ఉత్తర్వులతో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన చలానాలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో పంపే విధానం తక్షణమే అమల్లోకి వచ్చింది. ఇకపై డిజిటల్ రూపంలో వచ్చే చలానాలే అధికారికం కానున్నాయి.
{{/usCountry}}తమకు వచ్చిన చలానాలపై ఏవైనా అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు ఉంటే, వాహనదారులు సంబంధిత 'రెడ్రెస్సల్ అథారిటీ'ని సంప్రదించవచ్చని ప్రభుత్వం మరో జీవోలో పేర్కొంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, పరిసర మునిసిపాలిటీలు, ప్రతిపాదిత 'ఫ్యూచర్ సిటీ' కమిషనరేట్ పరిధిలో ఆయా ప్రాంతాల ట్రాఫిక్ డీసీపీలు పరిష్కార అధికారులుగా వ్యవహరిస్తారు.
మిగిలిన జిల్లాల్లో అడిషనల్ ఎస్పీ ఈ బాధ్యతలు చూస్తారు. ములుగు, నారాయణపేట జిల్లాల్లో మాత్రం నేరుగా జిల్లా ఎస్పీ ఈ ఫిర్యాదులను పర్యవేక్షిస్తారు. వాహనదారులు వెంటనే అప్రమత్తమై తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవడంతో పాటు, పెండింగ్ చలానాలను క్లియర్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.