భారతీయ రైల్వే ట్రైన్లలో ఛార్జింగ్ పాయింట్ల గురించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట రైలు ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లను రాత్రంతా ఛార్జింగ్‌లో ఉంచుకోవడానికి అనుమతించరు. రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల మధ్య ఛార్జింగ్ పాయింట్లను తప్పనిసరిగా ఆపివేయాలని రైల్వే బోర్డు అన్ని జోనల్ రైల్వేలకు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది.

రాత్రిపూట ప్రయాణాల సమయంలో కోచ్‌లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని బోర్డు ఒక అధికారిక ప్రకటనలో రైల్వే అధికారులను ఆదేశించింది. అధికారులు, పర్యవేక్షక సిబ్బంది ఈ ఆదేశాన్ని కచ్చితంగా పాటించేలా చూడాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి మినహాయింపులకు తావులేదని చెప్పారు.
రాత్రిపూట ప్రయాణ సమయంలో మొబైల్ ఛార్జింగ్ సర్క్యూట్లను నిలిపివేయాలని ఆదేశిస్తూ ఒక దశాబ్దానికి ముందే సర్క్యులర్ జారీ చేసినట్టుగా సీనియర్ రైల్వే అధికారులు తెలిపారు. అయితే కొన్ని రైళ్లలో ఈ నిబంధనను స్థిరంగా అమలు చేయడం లేదని అన్నారు.
సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్లో ఇటీవల జరిగిన ఒక సంఘటన నేపథ్యంలో ఈ చర్యను అమలు చేయాలని రైల్వే బోర్డు మరోసారి ఆదేశించింది. రైల్వే సిబ్బంది ఛార్జింగ్ పాయింట్లను ఆపివేయడంలో విఫలమవడంతో, ఒక మొబైల్ ఛార్జ్ అవుతున్నప్పుడు పవర్ బ్యాంక్ పేలిపోయిందని సమాచారం. ఈ సంఘటన వల్ల ప్రయాణికులలో భయాందోళనలు నెలకొన్నది. అయితే ప్రయాణికులకు పెద్ద గాయాలేవీ కాలేదు.
అయితే మొబైల్ ఫోన్ ఛార్జింగ్‌ను పూర్తిగా ఆపివేయడం కంటే.. రాత్రి సమయంలో పవర్ బ్యాంకుల ఛార్జింగ్‌ను నివారించడంపై దృష్టి పెట్టాలని కొందరు అధికారులు భావిస్తున్నారు. కోచ్‌లలో ఛార్జింగ్ పాయింట్ల సంఖ్యను పెంచకూడదని కూడా అంటున్నారు.
అర్నబ్ తుపాను కారణంగా ఒక రోజు అంతరాయం ఏర్పడిన తర్వాత గోదావరి ఎక్స్‌ప్రెస్, విశాఖ ఎక్స్‌ప్రెస్, ఇతర సర్వీసులతో సహా విశాఖపట్నం వైపు వెళ్లే దక్షిణ మధ్య రైల్వే మార్గంలోని రైలు సేవలు పునఃప్రారంభమయ్యాయి. వాతావరణ పరిస్థితులు మెరుగుపడటంతో సర్వీసులను పునరుద్ధరించారు.
{{/usCountry}}అర్నబ్ తుపాను కారణంగా ఒక రోజు అంతరాయం ఏర్పడిన తర్వాత గోదావరి ఎక్స్‌ప్రెస్, విశాఖ ఎక్స్‌ప్రెస్, ఇతర సర్వీసులతో సహా విశాఖపట్నం వైపు వెళ్లే దక్షిణ మధ్య రైల్వే మార్గంలోని రైలు సేవలు పునఃప్రారంభమయ్యాయి. వాతావరణ పరిస్థితులు మెరుగుపడటంతో సర్వీసులను పునరుద్ధరించారు.
{{/usCountry}}అయితే విశాఖపట్నం, కాకినాడ, నర్సాపూర్, శ్రీకాకుళం నుండి సికింద్రాబాద్, లింగంపల్లి, చర్లపల్లికి నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు అయ్యాయి. గురువారం నాటికి సాధారణ సర్వీసులు పునరుద్ధరిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. విశాఖపట్నం-ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ (LTT) ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి-షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌తో సహా సుమారు ఆరు రైళ్లను 180 నుంచి 280 నిమిషాల వరకు రీషెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే.