రైల్వే ప్రయాణికులకు విజ్ఞప్తి.. ఈ సమయాల్లో ట్రైన్లలో ఛార్జింగ్ పాయింట్లు ఆఫ్
భారతీయ రైల్వే ప్రయాణికులకు కీలక అప్డేట్ ఇచ్చింది. మెుబైల్ ఛార్జింగ్ పాయింట్ల గురించి ఇకపై కొత్త రూల్ కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.
భారతీయ రైల్వే ట్రైన్లలో ఛార్జింగ్ పాయింట్ల గురించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట రైలు ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లను రాత్రంతా ఛార్జింగ్‌లో ఉంచుకోవడానికి అనుమతించరు. రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల మధ్య ఛార్జింగ్ పాయింట్లను తప్పనిసరిగా ఆపివేయాలని రైల్వే బోర్డు అన్ని జోనల్ రైల్వేలకు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది.

రాత్రిపూట ప్రయాణాల సమయంలో కోచ్‌లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని బోర్డు ఒక అధికారిక ప్రకటనలో రైల్వే అధికారులను ఆదేశించింది. అధికారులు, పర్యవేక్షక సిబ్బంది ఈ ఆదేశాన్ని కచ్చితంగా పాటించేలా చూడాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి మినహాయింపులకు తావులేదని చెప్పారు.
రాత్రిపూట ప్రయాణ సమయంలో మొబైల్ ఛార్జింగ్ సర్క్యూట్లను నిలిపివేయాలని ఆదేశిస్తూ ఒక దశాబ్దానికి ముందే సర్క్యులర్ జారీ చేసినట్టుగా సీనియర్ రైల్వే అధికారులు తెలిపారు. అయితే కొన్ని రైళ్లలో ఈ నిబంధనను స్థిరంగా అమలు చేయడం లేదని అన్నారు.
సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్లో ఇటీవల జరిగిన ఒక సంఘటన నేపథ్యంలో ఈ చర్యను అమలు చేయాలని రైల్వే బోర్డు మరోసారి ఆదేశించింది. రైల్వే సిబ్బంది ఛార్జింగ్ పాయింట్లను ఆపివేయడంలో విఫలమవడంతో, ఒక మొబైల్ ఛార్జ్ అవుతున్నప్పుడు పవర్ బ్యాంక్ పేలిపోయిందని సమాచారం. ఈ సంఘటన వల్ల ప్రయాణికులలో భయాందోళనలు నెలకొన్నది. అయితే ప్రయాణికులకు పెద్ద గాయాలేవీ కాలేదు.
అయితే మొబైల్ ఫోన్ ఛార్జింగ్‌ను పూర్తిగా ఆపివేయడం కంటే.. రాత్రి సమయంలో పవర్ బ్యాంకుల ఛార్జింగ్‌ను నివారించడంపై దృష్టి పెట్టాలని కొందరు అధికారులు భావిస్తున్నారు. కోచ్‌లలో ఛార్జింగ్ పాయింట్ల సంఖ్యను పెంచకూడదని కూడా అంటున్నారు.
అర్నబ్ తుపాను కారణంగా ఒక రోజు అంతరాయం ఏర్పడిన తర్వాత గోదావరి ఎక్స్‌ప్రెస్, విశాఖ ఎక్స్‌ప్రెస్, ఇతర సర్వీసులతో సహా విశాఖపట్నం వైపు వెళ్లే దక్షిణ మధ్య రైల్వే మార్గంలోని రైలు సేవలు పునఃప్రారంభమయ్యాయి. వాతావరణ పరిస్థితులు మెరుగుపడటంతో సర్వీసులను పునరుద్ధరించారు.
అయితే విశాఖపట్నం, కాకినాడ, నర్సాపూర్, శ్రీకాకుళం నుండి సికింద్రాబాద్, లింగంపల్లి, చర్లపల్లికి నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు అయ్యాయి. గురువారం నాటికి సాధారణ సర్వీసులు పునరుద్ధరిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. విశాఖపట్నం-ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ (LTT) ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి-షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌తో సహా సుమారు ఆరు రైళ్లను 180 నుంచి 280 నిమిషాల వరకు రీషెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


