ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో పరీక్షలు రెండు రోజులపాటు వాయిదా
kakatiya university exams postpones : కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో చదివే విద్యార్థులకు అలర్ట్. టీజీఎస్ఆర్టీసీ సమ్మె కారణంగా యూనివర్సిటీ పరిధిలో పరీక్షలను రెండు రోజులపాటు వాయిదా వేశారు.
టీజీఎస్ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం తన పరిధిలోని అన్ని విద్యాసంస్థలలో పరీక్షలను రెండు రోజుల పాటు వాయిదా వేసింది. రవాణా సేవలకు అంతరాయం కలగడం వల్ల విద్యార్థులు, సిబ్బందికి అసౌకర్యం కలుగుతుందని పేర్కొంటూ అధికారులు శుక్రవారం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. వాయిదా పడిన పరీక్షల సవరించిన షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు విశ్వవిద్యాలయం తెలిపింది.
కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో పరీక్షలు వాయిదా
{{^htLoading}} {{/htLoading}}
నర్సంపేట డిపోకు చెందిన శంకర్ గౌడ్ అనే డ్రైవర్ మృతి నేపథ్యంలో ఆర్టీసీ యూనియన్లు వరంగల్ బంద్‌కు పిలుపునిచ్చాయి. మెరుగైన చికిత్స కోసం ఆయనను హైదరాబాద్ తరలించిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి.. శంకర్ గౌడ్ మరణించారు.
పీహెచ్‌డీ ప్రవేశాలు
మరోవైపు కాకతీయ విశ్వవిద్యాలయం సైన్సెస్ విభాగం (Faculty of Sciences), 2026-2027 జనవరి సెషన్‌కు గాను, సైన్స్ సబ్జెక్టులలోని Ph.D. ప్రోగ్రామ్‌లలో ప్రవేశం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అయితే నిజానికి ఇప్పటికే దరఖాస్తు తేదీ అయిపోవాలి. కానీ ఈ తేదీని ఏప్రిల్ 25వ తేదీ వరకు పొడిగించారు.
అర్హతా ప్రమాణాలు
ఫెలోషిప్ పొందినవారు (UGC-JRF/CSIR-JRF/CEED/DBT/NFPWD/DST-INSPIRE లేదా FIP/QIP టీచర్ ఫెలోషిప్‌లు మొదలైనవి). NET/GATE/GPAT లేదా ఇతర జాతీయ స్థాయి పరీక్షలలో స్కోరు సాధించినవారు కూడా అప్లై చేసుకోవచ్చు. Ph.D. ప్రోగ్రామ్‌లో ప్రవేశం కోసం NET స్కోరు చెల్లుబాటు కాలం ఒక సంవత్సరం ఉంటుంది.
4 సంవత్సరాల/8 సెమిస్టర్ల బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్ తర్వాత 1 సంవత్సరం/2 సెమిస్టర్ల మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ చేసి ఉండాలి లేదంటే.. 3 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్ తర్వాత 2 సంవత్సరాల/4 సెమిస్టర్ల మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ చేయాలి. ఈ అర్హతలలో మొత్తంగా కనీసం 55% మార్కులు రావాలి.
{{^htLoading}} {{/htLoading}}
{{^usCountry}}
ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ (నాన్-క్రీమీ లేయర్)/దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, ఇతర వర్గాలకు చెందిన అభ్యర్థులకు కమిషన్ ఎప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాల మేరకు 5 శాతం మార్కుల సడలింపు ఉంటుంది.
{{/usCountry}}
{{#usCountry}}
ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ (నాన్-క్రీమీ లేయర్)/దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, ఇతర వర్గాలకు చెందిన అభ్యర్థులకు కమిషన్ ఎప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాల మేరకు 5 శాతం మార్కుల సడలింపు ఉంటుంది.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.