తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్నస్వామి ఆలయం హనుమాన్ చిన్న జయంతి వేడుకలకు సిద్ధమైంది. ఏప్రిల్ 1 నుంచి 3 వరకు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు హనుమాన్ చిన్న జయంతి వేడుకలు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల నుండి సుమారు మూడు లక్షల మంది భక్తులు పాల్గొనే ఈ వేడుకల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు.

హనుమాన్ దీక్ష తీసుకున్న భక్తులు తమ దీక్షను ముగించుకోవడానికి ఆలయాన్ని సందర్శిస్తారు. వారిలో కొందరు అప్పటికే ఆలయానికి చేరుకోగా, చాలామంది వివిధ ప్రాంతాల నుండి కాలినడన బయలుదేరారు. ఆలయం వద్ద భారీ రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నందున.. ఆలయ అధికారులు మూడు రోజుల పాటు అన్ని 'అర్జిత సేవలను' రద్దు చేయాలని నిర్ణయించారు. భక్తుల సౌకర్యార్థం 50,000 లడ్డూలు, పులిహోర తదితర ప్రసాదాలను అదనంగా సిద్ధం చేశారు.
వివిధ ప్రదేశాలలో తాగునీటి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు, తాత్కాలిక పందిళ్ళు, స్వాగత తోరణాలు, ప్రత్యేక క్యూ లైన్లు, పార్కింగ్ స్థలాలు, తాత్కాలిక మరుగుదొడ్లు, ఇతర ఏర్పాట్లు చేశారు. యాత్రికులకు చికిత్స అందించేందుకు వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు.
జాతరను శాంతియుతంగా నిర్వహించేందుకు, పోలీసులు అదనపు బలగాలను మోహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఉన్న వాటికి అదనంగా మరిన్ని సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు.
పార్కింగ్ స్థలంతోపాటుగా నీటి వసతి, మరుగుదొడ్లు వంటి సదుపాయాలు ఏర్పాట్లు సరిగా చూసుకోవాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆదేశాలు ఇచ్చారు. వైద్య శిబిరాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, 108 అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలన్నారు. 24 గంటలు అంతరాయం లేకుండా సేవలు కొనసాగాలన్నారు. హనుమాన్ దీక్ష వేసుకున్నవారి కోసం వేములవాడ, జగిత్యాల, కరీంనగర్ నుంచి ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు తెలిపారు.
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న తర్వాత చాలా మంది భక్తులు వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్తుంటారు. కొండగట్టు నుంచి వేములవాడ వెళ్లేదారి బిజీబిజీగా ఉండనుంది.
హనుమాన్ భక్తులతో శునకం పాదయాత్ర
{{/usCountry}}కొండగట్టు అంజన్నను దర్శించుకున్న తర్వాత చాలా మంది భక్తులు వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్తుంటారు. కొండగట్టు నుంచి వేములవాడ వెళ్లేదారి బిజీబిజీగా ఉండనుంది.
హనుమాన్ భక్తులతో శునకం పాదయాత్ర
{{/usCountry}}కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఓ శునకం చేరుకుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి చేరుకోవడానికి సుమారు 130 కిలోమీటర్ల దూరం నడిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూరుకు చెందిన హనుమాన్ దీక్షా స్వాముల బృందం కొండగట్టు ఆలయానికి పాదయాత్రగా బయలుదేరారు. ఉట్నూరులో విశ్రాంతి తీసుకుంటుండగా కుక్క వారి వద్దకు వచ్చింది. హనుమాన్ దీక్షా స్వాములలో ఒకరు దానికి బిస్కెట్ ఇవ్వడంతో అది వారితోనే నడవడం ప్రారంభించింది.
ఆ శునకాన్ని పంపించడానికి ప్రయత్నించినప్పటికీ, హనుమాన్ దీక్షా స్వాములతోపాటే నడవడం కొనసాగించింది. హనుమాన్ దీక్షా స్వాములు కుక్క ఇబ్బంది పడకుండా కాళ్లకు వస్త్రాలు కట్టారు. కుక్క స్వాములకు రక్షణగా ఉండటంతో రాత్రిపూట ఎలాంటి భయం లేకుండా 20 కిలోమీటర్ల అటవీ ప్రాంతంలో నడిచారు. చివరకు ఆ శునకం 130 కిలోమీటర్లు నడిచి కొండగట్టు పుణ్యక్షేత్రానికి చేరుకుంది.