డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఈజీగా వచ్చేలా ప్లాన్ చేసింది. TCS iONతో కలిసి కొత్త ప్రోగ్రామ్‌ను రూపొందించింది. టీసీఎస్ అన్ని అధ్యయన కేంద్రాల నుండి దీనిని యాక్సెస్ చేసేలా విద్యార్థుల కోసం జాబ్ అచీవర్ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.

అంబేద్కర్ యూనివర్సిటీ, టీసీఎస్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ కోర్సు మొదటి సెమిస్టర్ నుండి విద్యార్థులకు అందిస్తారు. కంపెనీల అవసరాలను తీర్చడానికి, వ్యాపార సంస్థలలో అవకాశాలను పొందేందుకు వీలుగా ప్రత్యేకంగా రూపొందించారు. డిగ్రీ చదువుతున్నప్పుడు ఈ కోర్సును ఏకకాలంలో పూర్తి చేయవచ్చని యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ ఘంటా చక్రపాణి తెలిపారు.
కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు టీసీఎస్ ద్వారా ఉద్యోగ అవకాశాలను పొందుతారని వెల్లడించారు. కెరీర్ వృద్ధి, నైపుణ్యం పెంపుదల, ఆంగ్ల భాషా నైపుణ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించిన వర్క్‌షాప్‌లతో, క్యూరేటెడ్ వీడియో కంటెంట్, క్విజ్‌లు, ప్రాక్టికల్ సెషన్‌లతో ఆన్‌లైన్ కోర్సు విద్యార్థులకు అందిస్తారు. ఈ కోర్సు ద్వారా దూర విద్యలో చదువుతున్న విద్యార్థులకు కార్పొరేట్ రంగంలో విస్తృత ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని ఘంటా చక్రపాణి వెల్లడించారు.
'భారతదేశంలో తొలిసారిగా దూరవిద్య విద్యార్థుల కోసం టీసీఎస్ ఐయాన్‌తో ఈ ప్రొఫెషనల్ కోర్సును అందిస్తున్నాం. ఇది అంబేద్కర్ యూనివర్సిటీ ప్రత్యేకత. విద్యార్థులను మెుదటి సెమిస్టర్ నుంచి కార్పొరేట్ సంస్థలకు అవసరమైన నైపుణ్యాలతో తీర్చిదిద్దేలా ఈ కోర్సు రూపొందించాం.' అని ఘంటా చక్రపాణి తెలిపారు.
డిగ్రీ చదువుతూనే ఈ జాబ్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ పూర్తి చేసుకునే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడానికి ఉపయోగపడుతుందన్నారు. వృత్తి నైపుణ్యాలు, శిక్షణ కార్యక్రమాలు ద్వారా విద్యార్థులకు రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు కల్పించడానికి యూనివర్సిటీ కృషి చేస్తుందన్నారు.
{{/usCountry}}డిగ్రీ చదువుతూనే ఈ జాబ్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ పూర్తి చేసుకునే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడానికి ఉపయోగపడుతుందన్నారు. వృత్తి నైపుణ్యాలు, శిక్షణ కార్యక్రమాలు ద్వారా విద్యార్థులకు రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు కల్పించడానికి యూనివర్సిటీ కృషి చేస్తుందన్నారు.
{{/usCountry}}తెలంగాణలో ఉన్న అన్ని అధ్యయన కేంద్రాల సిబ్బంది, విద్యార్థులకు ఈ ప్రోగ్రామ్‌పై అవగాహన కల్పించడానికి ఆన్‌లైన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ పుష్పా చక్రపాణి, ఈఎంఆర్‌ఆర్‌సీ డైరెక్టర్ రవీంద్రనాథ్ సాలమన్, రిజిస్ట్రార్ డా.ఎల్.విజయకృష్ణారెడ్డి, టీసీఎస్ ఐయాన్ జాబ్ అచీవర్ ప్రాజెక్టు డైరెక్టర్ లీనా టిప్రే, ప్లేస్‌మెంట్ అధికారి వేణుగోపాల్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.