కాంగ్రెస్ ప్రచారానికి ‘బీజేపీ’ కౌంటర్ - నవంబర్ 2న హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర..!
ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై కాంగ్రెస్ చేస్తోన్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ సిద్ధమైంది. నవంబరు 2న హైదరాబాద్‌లో పాదయాత్ర నిర్వహించనున్నారు. ఇందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.
ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ వ్యాప్తి చేస్తోందని చెప్తున్న తప్పుడు కథనాలను, ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు తెలంగాణ భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది. దీనిలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నవంబరు 2వ తేదీన భాగ్యనగరంలో భారీ పాదయాత్ర చేపట్టనున్నారు.

నిజాం కాలేజీ నుంచి ప్రారంభం….
హైదరాబాద్ నిజాం కాలేజ్ వద్ద ఉన్న బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర మోజంజాహి మార్కెట్ (చౌరస్తా) వరకు కొనసాగుతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు శుక్రవారం విలేకరుల సమావేశంలో అధికారికంగా వెల్లడించారు.
శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ పాదయాత్ర ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. యాత్ర ముగింపు స్థానమైన మోజంజాహి చౌరస్తా వద్ద కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి న్యాయవాదులు, వైద్యులు, మేధావులు, వివిధ రంగాల ప్రముఖులతో పాటు వేలాది మంది బీజేపీ కార్యకర్తలు, సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాల్గొననున్నట్లు వివరించారు.
కాంగ్రెస్ ర్యాలీకి కౌంటర్‌గా యాత్ర…
ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ 'ఓటు చోరీ' ఆరోపణలపై నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు మరుసటి రోజే అమిత్ షా ఈ పాదయాత్ర చేపట్టడం రాజకీయంగా తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది. సవరణ ప్రక్రియపై కాంగ్రెస్ కావాలనే అసత్య ప్రచారం చేస్తోందని రామచందర్ రావు మండిపడ్డారు. కర్ణాటక మంత్రి సతీష్ జార్కిహోలి సైతం తమ రాష్ట్రంలో జరిగిన ఈ సవరణ ప్రక్రియను సమర్థించారని, అలాంటప్పుడు కాంగ్రెస్ లేనిపోని వివాదాలు సృష్టిస్తోందని ఆయన ఎత్తిచూపారు.
ఢిల్లీలో జరిగే నిరసన ప్రదర్శనకు వెళ్లేందుకు తమ కార్యకర్తలకు ప్రత్యేక రైళ్లను కేటాయించడం లేదంటూ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సికింద్రాబాద్‌లోని సౌత్ సెంట్రల్ రైల్వే జోనల్ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడంపై రామచందర్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రతిష్టను దిగజార్చడానికే కాంగ్రెస్ ఇటువంటి నాటకాలకు తెరలేపిందని దుయ్యబట్టారు.
ప్రత్యేక రైళ్లను బుక్ చేసుకోవడానికి కొన్ని నిబంధనలు, అధికారిక ప్రక్రియలు ఉంటాయని, వాటిని కచ్చితంగా పాటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే 1,000కి పైగా ప్రత్యేక రైళ్లను నడుపుతోందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

