ఐబొమ్మ రవి కేసులో మరో ట్విస్ట్.. సీన్‌లోకి ఇంకో కొత్త వ్యక్తి పేరు.. కానీ ఏ సంబంధమూ లేదు!

ఐబొమ్మ రవి కేసులో మరో ట్విస్ట్ వచ్చింది. మరో వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. కానీ అతడు మాత్రం నాకు ఐబొమ్మ రవితో ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నాడు.

Published on: Dec 28, 2025, 19:24:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. వెల్లేల ప్రహ్లాద్ అనే వ్యక్తి పేరుతో రవి, పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. విచారణ చేస్తుంటే.. అతడు తన రూమ్‌మేట్ అని.. అందుకే ఆ పేరును వాడుకున్నట్టుగా వెల్లడించాడు. ప్రహ్లాద్ గురించి పోలీసులు ఆరా తీశారు.

ఐబొమ్మ రవి కేసు
ఐబొమ్మ రవి కేసు

బెంగళూరు నుంచి ప్రహ్లాద్‌ను పిలిపించారు. కస్టడీలో ఉన్న ఐబొమ్మ రవి ముందుగానే ప్రహ్లాద్‌ను విచారణ చేశారు. దీంతో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. నిజానికి ఐబొమ్మ రవి, ప్రహ్లాద్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఇదే విషయాన్ని ప్రహ్లాద్ తెలిపాడు. రవి ఎవరో తనకు తెలియదని, తన పేరుతో పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్టుగా తెలిసి షాక్ అయ్యానని చెప్పాడు ప్రహ్లాద్. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న అతడి డాక్యుమెంట్స్‌ను ఐబొమ్మ రవి దొంగిలించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు డిసెంబర్ 29వ తేదీతో రవి పోలీస్ కస్టడీ ముగియనుంది.

కరేబియన్ దీవుల్లో ఉంటూ.. ఐబొమ్మ పైరసీ సైట్‌ను రన్ చేశాడు ఇమంది రవి. గతంలో చాలాసార్లు పోలీసులకు సవాల్ విసిరాడు. పూర్తిగా అక్కడే సెటిల్ కావాలి అనుకున్నాడు. కానీ హైదరాబాద్ వచ్చిన అతడు పోలీసులకు చిక్కాడు. పోలీసులు కూకట్‌పల్లిలోని గ్రీన్ హిల్స్ రోడ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో అతన్ని అరెస్టు చేశారు. విచారణ చేస్తుంటే అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

దర్యాప్తు అధికారులు రవి కదలికలను వారాల తరబడి ట్రాక్ చేశారు. అతని ఫోన్ నంబర్లను గుర్తించి, అతనిపై నిఘా పెట్టే ముందు అతని పరిచయాల గురించి కూడా తెలుసుకున్నారు. రవితోనే ఐబొమ్మ సైట్లను క్లోజ్ చేయించారు. అయితే అదే పేరుతో ఉన్నట్టుగా మార్కెట్లోకి ఇప్పుడు కొన్ని సైట్లు వచ్చాయి.

విశాఖపట్నానికి చెదిన ఇమంది రవి ఐబొమ్మ పైరసీలో ప్రధాన నిందితుడు. ఇప్పటికే పలుసార్లు పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేశారు. స్వాధీనం చేసుకున్న హార్డ్ డ్రైవ్‌లలో అనేక భాషలలో దాదాపు 21,000 సినిమాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. సుమారు రూ.20 కోట్లు సంపాదించాడని వార్తలు వచ్చాయి. దర్యాప్తు సమయంలో అతని బ్యాంకు ఖాతాల్లోని సుమారు రూ.3.5 కోట్లను సీజ్ చేశారు.

పైరసీ వెబ్‌సైట్ నుంచి సినిమాలను రికార్డింగ్ చేసినట్టుగా పోలీసులకు రవి తెలిపాడు. ఓటీటీలో వచ్చే సినిమాలను కూడా రికార్డింగ్ చేసినట్టుగా అంగీకరించాడు. ఆ ఆడియోలు, వీడియోల క్వాలిటీ పెంచేందుకు ఔట్ సోర్సింగ్ వారితో ఒప్పందం చేసుకున్నట్టుగా రవి వెల్లడించాడు. పైరసీ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ గురించి చెప్పాడు. ఐబొమ్మ పూర్తిపేరు ఇంటర్నేట్ బొమ్మగా.., విశాఖలో సినిమాను బొమ్మగా పిలిచేవాళ్లమని, అందుకే ఆ పేరు పెట్టినట్టుగా రవి క్లారిటీ ఇచ్చాడు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More