...
...
Next Story

కొండగట్టు నాకు పునర్జన్మ ఇచ్చింది - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

కొండగట్టు తనకు పునర్జన్మనిచ్చిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. గతంలో జరిగిన విద్యుత్‌ ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డానో ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తోందన్నారు. కొండగట్టు అంజన్నే తనను కాపాడరని తెలిపారు.

Published on: Jan 3, 2026, 14:41:33 IST
Advertisement

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం తమ ఇలవేల్పు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తి పూర్వకంగా ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన…

కొండగట్టులో డిప్యూటీ సీఎం పవన్
కొండగట్టులో డిప్యూటీ సీఎం పవన్

సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అనంతరం 2024లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలయాన్ని సందర్శించిన సందర్భంలో కొండగట్టు అంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రూ. 35.19 కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ సహకారంతో నేడు దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేశారు.

శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలసి ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తెలంగాణ దేవాదాయశాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యార్ ఆధ్వర్యంలో ఆలయ ఆర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రధాన స్థానాచార్యులు శ్రీ కపీంద్ర స్వామి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను సంప్రదాయబద్దంగా ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం శ్రీ ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆంజనేయస్వామికి ఇరువైపులా ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీ అమ్మవార్లకు అర్చనలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు అందించి, స్వామి వారి తీర్థ ప్రసాదం అందచేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ హరీష్, ఈవో శ్రీ టి. శ్రీకాంతరావులు స్వామి వారి చితపటాన్ని బహూకరించారు.

కొండగట్టు నాకు పునర్జన్మ ఇచ్చింది - డిప్యూటీ సీఎం పవన్

“ఇక్కడ దీక్ష విరమణకు సత్రం కావాలని అర్చక ప్రముఖులు కోరారు. అది నా మనసులో ఉంది. అక్కడ(ఏపీ) ప్రజల ఆశీసులతో కూటమి ప్రభుత్వం విజయం సాధించడంతో టీటీడీ నుండి చెయ్యడానికి ఇది సాధ్యపడింది. దీనికి ఆమోదం తెలిపిన టీటీడీ బోర్డు చైర్మన్ తో పాటు సీఎం చంద్రబాబు, మంత్రి అనం రాంనారాయణరెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఇతర అధికారులందరికీ పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని చెప్పారు.

“తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొండగట్టు అంజన్న ఆలయానికి గిరి ప్రదక్షిణ లాంటిది ఏర్పాటు చేయడానికి మీరంతా పూనుకుంటే బావుంటది అంటే దీనికి నా వంతు కృషి నేను కచ్చితంగా చేస్తాను అని చెప్పాను.ఇది రామ సేవ, భజరంగబలి సేవ” అంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

టీటీడీ ఆధ్వర్యంలో కొండగట్టు ఆలయానికి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య కారణం పవన్ కల్యాణ్ అని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. భవిష్యత్తులో మరెన్నో గొప్ప కార్యక్రమాలు కొండగట్టు ఆలయంలో చేయబోతున్నామని ప్రకటించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe