AP Heatwave Alert : ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు - రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు

AP Heatwave Alert : ఏపీలో ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇవాళ 51 మండలాల్లో తీవ్ర వడగాలులు, 49 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

Published on: Apr 13, 2026, 06:32:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP Heatwave Alert : ఏపీవ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎండల తీవ్రత మరింత పెరగడమే కాకుండా, చాలా మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఈ మేరకు హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు (image source @APSDMA)
ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు (image source @APSDMA)

వడగాలుల హెచ్చరికలు….

ఇవాళ(ఏప్రిల్ 13) రాష్ట్రంలోని 51 మండలాల్లో తీవ్రవడగాలులు, 49 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మంగళవారం 53 మండలాల్లో తీవ్రవడగాలులు, 57 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం సూచనలున్నాయి.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాల్పులు,కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉంది. ఎండ తీవ్రత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

ఆదివారం కడప జిల్లా పొట్టిపాడులో 43.8 డిగ్రీలు,తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల రూరల్ లో 42.9 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. "ఎండ దెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండటానికి నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి పానీయాలు ఎక్కువగా తీసుకోవాలి," అని విజ్ఞప్తి చేశారు. బయటకు వెళ్లేవారు గొడుగు, టోపీ లేదా తలపాగా వంటివి ధరించడం వల్ల నేరుగా ఎండ తగలకుండా చూసుకోవచ్చని సూచించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More