...
...
Next Story

సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు - రాత పరీక్ష లేకుండానే...!

Army Public School RK Puram Recruitment : సికింద్రాబాద్ ఆర్‌కే పురం ఆర్మీ పబ్లిక్ స్కూల్‌ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. 2026-2027 విద్యా సంవత్సరానికి గానూ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు మే 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

Published on: Apr 27, 2026 12:37 PM IST
Advertisement

Army Public School RK Puram Recruitment 2026: టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ (APS) నోటిఫికేషన్ జారీ చేసింది. 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి కాంట్రాక్ట్, అడహాక్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనుంది.

  • పీజీటీ (లీగల్ స్టడీస్): 11, 12 తరగతులకు బోధించాల్సి ఉంటుంది. లా లో బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీతో పాటు బీఈడీ (B.Ed) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీరికి నెలకు రూ.40,000 వేతనం అందిస్తారు.
  • టీజీటీ (సంస్కృతం): 6 నుండి 10వ తరగతి వరకు బోధించేందుకు అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో డిగ్రీ, బీఈడీ కలిగి ఉండాలి. వీరికి రూ. 38,000 వేతనం ఉంటుంది.
  • అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: రిటైర్డ్ మహిళా అధికారులు లేదా సివిలియన్ మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు. 55 ఏళ్లలోపు వయస్సు ఉండి, కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండాలి.
  • ఎల్‌డీసీ (LDC): కేవలం ఎక్స్-సర్వీస్‌మెన్ (ESM) అభ్యర్థులకు మాత్రమే ఈ అవకాశం ఉంది. డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
  • స్కూల్ రిసెప్షనిస్ట్ - పారామెడిక్ (నర్స్) పోస్టులను కేవలం మహిళా అభ్యర్థుల ద్వారానే భర్తీ చేయనున్నారు. రిసెప్షనిస్ట్ పోస్టుకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం ఉండాలి. పారామెడిక్ పోస్టుకు 10+2తో పాటు నర్సింగ్‌లో డిప్లొమా చేసి, ఐదేళ్ల అనుభవం కలిగి ఉండాలి.
  • ఐటీ, ల్యాబ్ సిబ్బంది: ఐటీ సూపర్ వైజర్, సైన్స్ ల్యాబ్ అటెండెంట్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు కూడా దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీ సూపర్ వైజర్ పోస్టుకు కంప్యూటింగ్ మరియు హార్డ్‌వేర్‌లో డిప్లొమా ఉండాలి. ల్యాబ్ పోస్టులకు 40 ఏళ్లలోపు వయస్సు ఉన్న వారు అర్హులు.

దరఖాస్తు విధానం…..

ఆర్మీ పబ్లిక్‌ స్కూల్లో టీచింగ్‌, నాన్‌-టీచింగ్‌ ఖాళీలు
ఆర్మీ పబ్లిక్‌ స్కూల్లో టీచింగ్‌, నాన్‌-టీచింగ్‌ ఖాళీలు

ఆసక్తి గల అభ్యర్థులు స్కూల్ అధికారిక వెబ్‌సైట్ apsrkpuram.edu.in నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. పూర్తి చేసిన ఫారంతో పాటు విద్యా అర్హతల పత్రాలు, అనుభవ ధృువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను జత చేయాలి. దీనితో పాటు రూ.250 డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) ' Army Public School RK Puram' పేరుతో తీసి…. మే 1, 2026 సాయంత్రం లోపు స్కూల్ ప్రిన్సిపాల్(ది ప్రిన్సిపల్‌, ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ ఆర్‌కే పురం, సికింద్రాబాద్‌) కార్యాలయానికి పంపాలి. కేవలం షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూకు పిలుస్తారు. ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్టును విడుదల చేసి ఫలితాలను ప్రకటిస్తారు.

ఈ లింక్ పై క్లిక్ చేసి ఉద్యోగ నోటిఫికేషన్ తో పాటు ఖాళీల వివరాలను చెక్ చేసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe