సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు.. 1000 రోజుల పాలనపై వాడివేడిగా చర్చ

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభం కానున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై వాడివేడిగా చర్చ జరగనుంది.

Published on: Sep 6, 2026, 14:56:25 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సోమవారం(సెప్టెంబర్ 7) ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశం ఉంది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొననుండగా, వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

అన్ని అంశాలపై చర్చకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. 2023 డిసెంబర్‌లో అధికారం కోల్పోయినప్పటి నుండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి, బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు.

బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడతామని ప్రకటించిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 1000 రోజులు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. అసెంబ్లీకి హాజరుకాకపోవడంపై కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజులుగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు.

ఇటీవల జరిగిన ఒక బహిరంగ సభలో గత 1000 రోజుల్లో కేసీఆర్ జీతం కోసం రూ. 1.24 కోట్లు, అలాగే ఆయన భద్రత, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ఇతర సౌకర్యాల కోసం రూ. 21 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలన్న కాంగ్రెస్ డిమాండ్‌పై బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా మళ్లీ అసెంబ్లీలో అడుగుపెడతారని అంటోంది. ఈ విషయంపై సభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

అధికారంలో 1,000 రోజులు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై చార్జ్‌షీట్ విడుదల చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వం అనేక కీలక హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, పాలనలోనూ వెనుకబడిందని ఆరోపించారు.

గత 1000 రోజుల్లో ప్రభుత్వ పనితీరు కారణంగా రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, మహిళలు, ఉద్యోగులు, ఇతర వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేటీఆర్ విమర్శించారు. నెరవేరని ఎన్నికల హామీలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A కింద నిషేధిత జాబితాలో పెద్ద ఎత్తున భూములను చేర్చడం, అధికార కాంగ్రెస్ పార్టీ నెరవేర్చని హామీలు వంటి వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి బీజేపీ కూడా సన్నద్ధమవుతోంది.

నీట్ అంశంపై ఢిల్లీలో ఇటీవల సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనపై రేవంత్ రెడ్డి స్పందించిన విషయం తెలిసిందే. లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయస్సును 25 ఏళ్ల నుండి 21 ఏళ్లకు తగ్గించేలా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూలైలో ప్రకటించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More