...
...
Next Story

మేడారం జాతరలో చెట్టు కిరాయి రూ.1000, బైక్ ట్యాక్సి, వేడి నీళ్లు రూ.50!

మేడారం మహాజాతరకు భారీగా భక్తులు వస్తున్నారు. వనదేవతల దర్శనం కోసం భక్తులు క్యూ కడుతున్నారు. జాతరలో కొందరు రకరకాల బిజినెస్‌లు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు.

Published on: Jan 22, 2026, 05:47:57 IST
Advertisement

మేడారం మాహాజాతర 2026 సందడి మెుదలైంది. అమ్మవార్లకు ఎత్తు బంగారాలు, మెుక్కులు చెల్లిస్తూ జాతర వాతావరణం కోలాహలంగా ఉంది. వనదేవతల దర్శనానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు జనాలు. సాధారణంగా మేడారం మహా జాతర సమయంలో రకరకాల వ్యాపారాలు జరుగుతాయి. కోట్ల రూపాయాల లావాదేవీలు అవుతాయి. మేడారం ఎంట్రీ నుంచి జంపన్నవాగు దాకా అక్కడివారు రకరకాల బిజినెస్‌లు చేస్తున్నారు.

మేడారం జాతర
మేడారం జాతర

మేడారంలో ఎంట్రీ దగ్గరే కొంతమంది యువకులు బైక్ ట్యాక్సీలు ఏర్పాటు చేసుకుని సంపాదన ప్లాన్ చేస్తున్నారు. సమ్మక్క గద్దెలు, జంపన్నవాగు అంటూ కొందరు యువకులు కనిపిస్తారు. ఎక్కడకు వెళ్లినా రూ.50 అని చెబుతున్నారు. వారిని అడిగితే మేడారంలో ఎటువెళ్లినా రూ.50 తీసుకుంటున్నామని అంటున్నారు. ఈ యువకుల ఐడియా చూసి చాలా మంది వావ్ అని చెబుతున్నారు. ఏదో రకంగా ఉపాధి మార్గం చూసుకున్నారని అంటున్నారు. అయితే ఎక్కువగా జనాలు ఈ బైకులను ఉపయోగించడం లేదు.

మేడారం జాతర అనగానే కోడినో.. మేకనో కోస్తుంటారు. ఆ తర్వాత వాడిని వండుకోవడానికి సరైన స్థలం కావాల్సి వస్తుంది. అమ్మవార్లకు మెుక్కులు సమర్పించుకుని కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తుంటారు. అయితే మేడారంలాంటి ప్రదేశంలో సరైన స్థలం దొరకాలంటే చాలా ఇబ్బందే. అంతేకాదు భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో శుభ్రత తక్కువగానే ఉంటుంది. అయితే ఇదే స్థానికులు బిజినెస్‌గా మార్చుకున్నారు. చెట్లను కిరాయికి ఇస్తున్నారు. కుటుంబం అంతా కలిసి కూర్చొని కాసేపు గడపడానికి, భోజనం చేయడానికి చెట్లను అద్దెకు ఇస్తున్నారు. వీటి ఖరీదు రూ.1000 నుంచి రూ.2000 వరకు కూడా ఉన్నాయి. కొందరు రూ.500కు కూడా చెట్లను కిరాయికి ఇస్తున్నారు. గంటలు, రోజుల లెక్కన కూడా అద్దెకు తీసుకుంటున్నారు.

చాలామంది మాత్రం మేడారంలో భక్తులను దోపిడి చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. ప్రతీదానికి ఎక్కువ మెుత్తంలో వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. సామాన్య భక్తులకు ఇది పెద్ద సమస్యగా మారిందని అంటున్నారు.

మేడారం జాతర ముఖ్యమైన తేదీలు

జనవరి 27 - మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు మేడారానికి పయనం. ఇదే రోజు తాడ్వాయి మండలంలో కన్నెపల్లి నుంచి జంపన్న బయలుదేరి మేడారం గద్దెకు చేరుకుంటారు.

జనవరి 28 - కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవత, ఏటూరునాగారం మండలంలో గల కొండాయి నుంచి గోవిందరాజులు, మహబూబాబాద్ జిల్లా నుంచి బయలుదేరిన పగిడిద్దరాజులు గద్దెకు చేరుకుంటారు.

జనవరి 29 - వనదేవత సమ్మక్క చిలుకలగుట్ట నుంచి బయలుదేరి గద్దెపైకి వస్తారు.

జనవరి 30 - భక్తులు ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లిస్తారు.

జనవరి 31 - దేవతల వన ప్రవేశం.

ఫిబ్రవరి 4 - తిరుగువారం పండుగ, మహా జాతర ఉత్సవాల ముగింపు ఉంటుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe