మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు - విధుల్లో 42 వేల మంది సిబ్బంది, 1418 ఎకరాల్లో పార్కింగ్

మేడారం జాతరకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. మొత్తం 21 శాఖలకు చెందిన 42,027 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. మేడారం ప్రాంతాన్ని మొత్తం 8 జోన్లుగా… 42 సెకార్టుగా విభజించి పర్యవేక్షిస్తున్నారు.

Published on: Jan 18, 2026, 10:09:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతరకు సర్వం సిద్ధమయ్యాయి. ఈసారి 3 కోట్ల మంది భక్తులు రావొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తోంది. రాకపోకల నుంచి దర్శనం వరకు భక్తులకు ఇబ్బందులు రాకుండా చూసే దిశగా కార్యాచరణను సిద్ధం చేసింది.

మేడారం జాతరకు ఏర్పాట్లు సిద్ధం
మేడారం జాతరకు ఏర్పాట్లు సిద్ధం

మేడారం మహా జాతర ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుంది. ఈసారి 2026 జనవరి 28 నుండి జనవరి 31 వరకు జరగనుంది. జనవరి 28న సారలమ్మ, జనవరి 29న సమ్మక్క గద్దెలపైకి చేరుకుంటారు. జనవరి 30న భక్తులు మొక్కులు చెల్లించి, జనవరి 31న దేవతలు వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. అయితే జాతర ప్రారంభానికి ముందే భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో మేడారం వెళ్లే దారులన్నీ రద్దీగా మారాయి.

మేడారం జాతరకు విస్తృత ఏర్పాట్లు - ముఖ్య విషయాలు

  • మేడారం జాతర కోసం మొత్తం 21 శాఖలకు చెందిన 42,027 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. 2 వేల మంది ఆదివాసీ వాలంటీర్లు విధుల్లో ఉంటారు.
  • 27 శాశ్వత, 33 తాత్కాలిక మొబైల్ టవర్స్ ఏర్పాటు చేశారు.
  • 1418 ఎకరాల్లో 42 పార్కింగ్ కేంద్రాలను ఏర్పాట్లు చేశారు.
  • 4 వేల ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తాయి.10,441 మంది ఆర్టీసీ సిబ్బంది విధుల్లో ఉంటారు.
  • 5,482 తాగు నీటి పాయింట్లు ఉంటాయి.
  • జంపన్న వాగు వద్ద 119 డ్రెసింగ్ రూమ్స్ ఏర్పాటు
  • 5,700 టాయిలెట్స్ ఏర్పాటు చేయగా… 5,000 మంది పారిశుద్ధ్య సిబ్బంది ఉంటారు.
  • 196 ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేయగా… 911 స్తంబాలు ఉంచారు.
  • 5,192 మెడికల్ సిబ్బంది విధుల్లో ఉంటారు.
  • మేడారం జాతర కవరేజీ కోసం అడ్వాన్స్ మీడియా సెంటర్
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More