...
...
Next Story

Bakrid 2026 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బక్రీద్ పండుగ ఎప్పుడు? ఇదిగో క్లారిటీ

Bakrid 2026 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బక్రీద్ పండుగ తేదీపై ఇప్పటికీ కొందరికి గందరగోళం ఉన్నది. బక్రీద్ హాలీడే తేదీ మారింది. మే 27, మే 28 తేదీల్లో ఎప్పుడు అని చాలా మంది చర్చించుకుంటున్నారు.

Published on: May 25, 2026, 18:46:57 IST
Advertisement

పండుగ దగ్గరపడుతున్న కొద్దీ బక్రీద్ సెలవు తేదీపై నెలకొన్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. సాధారణంగా ముస్లింల పండుగలు నెలవంక దర్శనం ఆధారంగా నిర్ణయించబడతాయి. ఈ క్రమంలోనే జూన్ నెలలో వస్తుందని భావించిన బక్రీద్ పండుగ, ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది మే నెల చివరలోనే రానుంది. భారతదేశంలోని అత్యధిక ప్రాంతాలతో పాటు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కూడా ఈ ఏడాది మే 28, 2026 (గురువారం) నాడు బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పండుగను ఘనంగా జరుపుకోనున్నారు.

బక్రీద్ పండుగ ఎప్పుడు?
బక్రీద్ పండుగ ఎప్పుడు?

సాధారణంగా బక్రీద్ పండుగను దేశవ్యాప్తంగా ఒక రోజు జరుపుకొంటారు. అయితే ఈసారి నెలవంక దర్శనంలో మార్పుల వల్ల కొన్ని రాష్ట్రాల్లో సెలవుల విషయంలో సవరణలు చేశారు. గతంలో అధికారిక క్యాలెండర్ ప్రకారం మే 27న సెలవుగా భావించినప్పటికీ, ఇస్లామిక్ క్యాలెండర్‌లోని చివరి నెల 'దుల్ హిజ్జా' నెలవంక ఆలస్యంగా కనిపించడంతో పండుగ తేదీ మారింది. దీని ప్రకారం మే 28న పండుగ అని మత పెద్దలు ధృవీకరించారు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మే 28వ తేదీని (గురువారం) అధికారిక ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాయి. దీంతో మే 28వ తేదీన బక్రీద్ పండుగ జరుపుకోనున్నారు.

ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం పవిత్ర హజ్ యాత్ర ముగింపును సూచిస్తూ జరుపుకొనే ఈ త్యాగాల పండుగ తేదీని నెలవంక దర్శనం బట్టి నిర్ణయిస్తారు. సౌదీ అరేబియాలో చంద్రదర్శనం అయిన మరుసటి రోజు భారత్‌లో పండుగను జరుపుకొంటారు. ఈసారి భారత్‌లో 'దుల్ హిజ్జా' నెలవంక ఆలస్యంగా దర్శనమివ్వడంతో పండుగను మే 28కి ఖరారు చేశారు.

బక్రీద్ పండుగను పురస్కరించుకుని తెలంగాణ (ముఖ్యంగా హైదరాబాద్, పరిసర ప్రాంతాలు), ఆంధ్రప్రదేశ్‌లలో పండుగ సందడి అప్పుడే మొదలైంది. మార్కెట్లు సరికొత్త దుస్తులు, పండుగ సామాగ్రితో కళకళలాడుతున్నాయి.

ఈ పండుగ మార్పుల ప్రభావం దేశీయ ఆర్థిక మార్కెట్లపై కూడా పడింది. మే 28న బక్రీద్ సందర్భంగా దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లు తమ వార్షిక సెలవుల జాబితాలో ఈ తేదీని చేర్చాయి. కాబట్టి మే 28 (గురువారం) నాడు ఎలాంటి ట్రేడింగ్ కార్యకలాపాలు జరగవు, మార్కెట్లు పూర్తిగా క్లోజ్ ఉంటాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe