హైదరాబాద్‌లో బక్రీద్ ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లలో వెళ్తున్నారా? ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే!
హైదరాబాద్‌లో బక్రీద్ పండుగ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించారు. దానికి తగ్గట్టుగా ప్రజలు ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలి.
బక్రీద్ పండుగను పురస్కరించుకుని నగరంలో మేకలు, గొర్రెల విక్రయాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులకు ఇబ్బంది కలగకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ శాఖ మే 27, మే 28 తేదీల్లో నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు మరియు మళ్లింపులను ప్రకటించింది. ముఖ్యంగా సాయంత్రం 5:00 గంటల నుండి తెల్లవారుజామున 4:00 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. టోలిచౌకి - నానల్ నగర్ - రేతిబౌలి ఇరువైపులా, అలాగే రేతిబౌలి - అత్తాపూర్ మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు.

టౌలిచౌకి, మెహదీపట్నం పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు
- రాయదుర్గం, గచ్చిబౌలి నుండి మెహదీపట్నం వెళ్లే వారు.. షేక్‌పేట్ అండర్‌పాస్ వద్ద ఫిల్మ్ నగర్ రోడ్డు వైపు లేదా షేక్‌పేట్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత బృందావన్ కాలనీ రోడ్డు గుండా వెళ్లాల్సి ఉంటుంది.
- లక్డీకాపూల్ నుండి రాయదుర్గం, గచ్చిబౌలి వెళ్లే వారు.. మాసబ్ ట్యాంక్ జంక్షన్ వద్ద కుడి వైపునకు తిరిగి బంజారాహిల్స్ మీదుగా ప్రయాణించాలి.
- మెహదీపట్నం నుండి రాయదుర్గం, గచ్చిబౌలి వెళ్లే వారు.. నానల్ నగర్ ఎక్స్‌రోడ్స్ వద్ద లంగర్ హౌజ్, నార్సింగి రోడ్డు వైపు మళ్లడం మంచిది.
- మాసబ్ ట్యాంక్ నుండి అత్తాపూర్ వెళ్లే వారు.. మిరాజ్ కేఫ్, గుడిమల్కాపూర్ మీదుగా పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే (పిల్లర్ నంబర్ 2, 3) రూట్‌ను ఉపయోగించుకోవాలి.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు సూచన
రాత్రి వేళల్లో మెహదీపట్నం - టోలిచౌకి రూట్‌లోకి రాకుండా, ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా వెళ్లాలని పోలీసులు సూచించారు.
ఇతర ప్రాంతాలలో బక్రీద్ ట్రాఫిక్ ఆంక్షలు
ముఖ్య ప్రార్థనా స్థలాలైన మీర్ ఆలం ఈద్గా, సికింద్రాబాద్ ఈద్గా పరిసరాల్లో కూడా పండుగ రోజు ఉదయం పూట ప్రత్యేక ఆంక్షలు ఉంటాయి.
- మీర్ ఆలం ఈద్గా పరిసరాల్లో (బహదూర్‌పురా): పురానాపూల్, కమలాపూర్ నుండి వచ్చే ట్రాఫిక్.. బహదూర్‌పురా ఎక్స్‌రోడ్స్ వద్ద కిషన్ బాగ్ లేదా బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ వైపు మళ్లిస్తారు.
- శివరాంపల్లి, ఎన్‌పీఏ నుండి వచ్చే ట్రాఫిక్.. దనమ్మ హట్స్ ఎక్స్‌రోడ్స్ వద్ద శాస్త్రిపురం గుండా మళ్లిస్తారు.
- కాలాపత్తర్ నుండి ఈద్గా వైపు వచ్చే వాహనాలు.. మోతీగల్లీ వద్ద కాలాపత్తర్ పీఎస్ వైపు పంపుతారు.సికింద్రాబాద్ ఈద్గా పరిసరాల్లో: మిలటరీ ట్రేడ్స్ ట్రైనింగ్ స్కూల్ (MTTS) నుండి వచ్చే ట్రాఫిక్.. ఈద్గా వైపు అనుమతించరు. వీటిని లూథరన్ చర్చ్ మీదుగా మళ్లిస్తారు.
ట్రాఫిక్ హెల్ప్‌లైన్
ప్రయాణ సమయంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా, ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్నా వాహనదారులు 9010203626 నంబర్‌కు ఫోన్ చేసి ట్రాఫిక్ హెల్ప్‌లైన్ సహాయం పొందవచ్చు. అలాగే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఇచ్చే లైవ్ అప్‌డేట్స్‌ను గమనిస్తూ సహకరించాలని పోలీసులు కోరారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


