నా కొడుకును నేనే పోలీసులకు అప్పగించా.. కొత్త పార్టీపై బండి సంజయ్ క్లారిటీ

బీజేపీలో ప్రతిఒక్కరూ సుశిక్షితులైన కార్యకర్తలేనని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. కొత్త పార్టీ పెట్టడంపై క్లారిటీ ఇచ్చారు.

Published on: May 20, 2026, 16:34:29 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "భారతీయ జనతా పార్టీ (BJP) లో ప్రతి ఒక్కరూ సుశిక్షితులైన సిపాయిలే. క్రమశిక్షణ, దేశభక్తి, కమిట్‌మెంట్‌తో పనిచేసే కరడుగట్టిన బీజేపీ కార్యకర్తను చివరి కోరిక ఏంటని అడిగితే.. తాను చనిపోయిన తర్వాత తన పార్థివదేహంపై బీజేపీ జెండా కప్పాలని కోరుకుంటాడు." అంటూ భావోద్వేగంగా మాట్లాడారు.

బండి సంజయ్
బండి సంజయ్

ఇటీవల తన కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు, తదనంతర రాజకీయ పరిణామాలపై సంజయ్ సూటిగా స్పందించారు. తనను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్న బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలకు ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు.

చట్టం ముందు అందరూ సమానమే

"కన్నకొడుకును విచారణ కోసం పోలీసులకు స్వయంగా అప్పగించిన తండ్రి ఎవరైనా ఉన్నారా? చట్టంపై గౌరవంతో, విచారణకు సహకరించాలనే ఉద్దేశంతోనే నా కుమారుడిని పోలీసులకు అప్పగించా. చట్టం ముందు ఎవరైనా సమానమే. నా కుమారుడు తప్పు చేయలేదని చెబుతున్నాడు, న్యాయస్థానాలపై మాకు పూర్తి నమ్మకం ఉంది" అని బండి సంజయ్ స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్ ఫేక్ సోషల్ మీడియా ఫ్యాక్టరీ

మాజీ సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లను లక్ష్యంగా చేసుకుని సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. "లోక్‌సభలో కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా లేని కేసీఆర్ పార్టీ.. ఫామ్‌హౌస్‌లో కూర్చుని నీతులు చెబుతోంది. తెలంగాణలో కేసీఆర్ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో కూల్చింది, ఆ కుటుంబ నియంతృత్వ పాలనను అంతం చేసింది బీజేపీనే. ఆ కక్షతోనే మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు" అని మండిపడ్డారు. కేటీఆర్ ఒక ఫేక్ సోషల్ మీడియా ఫ్యాక్టరీని నడుపుతూ, తమపై బురదజల్లేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకునేందుకు హైదరాబాద్ సివిల్ కోర్టును ఆశ్రయించానని, సామాజిక మాధ్యమాల్లో తన ప్రతిష్టకు భంగం కలిగించే కంటెంట్‌ను తొలగించాలని కోరినట్లు సంజయ్ తెలిపారు. తాను ఎలాంటివాడినో తెలంగాణ ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు బాగా తెలుసని ఆయన వ్యాఖ్యానించారు.

కొత్త పార్టీ పెట్టే ఆలోచన తనకు లేదని బండి సంజయ్ అన్నారు. అలాంటి లీడర్ తాను కాదని స్పష్టం చేశారు. 'కన్న కొడుకును పోలీసులకు అప్పగించిన తండ్రిని నేను. నన్ను భర్తరఫ్ చేస్తారని కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నాడు. నేను కొత్త పార్టీ పెట్టేది లేదు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నాడు.' అని సంజయ్ అన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More