...
...
Next Story

బండి భగీరథ్ పోక్సో కేసులో ఆ పేరు వాడకూడదు.. కోర్టు ఆదేశాలు

Bandi Bhageerath Case : బండి భగీరథ్ పోక్సో కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తన పేరును ప్రస్తావించకూడదని పిటిషన్ వేశారు.

Updated on: May 15, 2026, 18:15:17 IST
Advertisement

హైదరాబాద్ : బండి భగీరథ్ పోక్సో కేసుకు సంబంధించి సిటీ సివిల్ కోర్టు శుక్రవారం ఒక కీలకమైన ఆదేశాన్ని జారీ చేసింది. ఈ వివాదాస్పద కేసులో కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ పేరును ఎక్కడా ఉపయోగించరాదంటూ కోర్టు స్పష్టమైన ఆదేశాలు (గ్యాగ్ ఆర్డర్) ఇచ్చింది.

కోర్టును ఆశ్రయించిన కేంద్రమంత్రి

బండి సాయి భగీరథ్
బండి సాయి భగీరథ్

బండి భగీరథ్ అనే వ్యక్తికి సంబంధించిన కేసులో అనవసరంగా తన పేరును లాగుతున్నారని, దీనివల్ల సమాజంలో తన ప్రతిష్టకు భంగం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ బండి సంజయ్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, సంచలనం కోసం మీడియాలోని కొన్ని విభాగాలు తన పేరును వాడుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

మీడియా వార్తలపై ఆంక్షలు

బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సమగ్రంగా విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు, ఆయన వాదనలతో ఏకీభవించింది. బండి భగీరథ్ కేసు విషయంలో కేంద్రమంత్రి బండి సంజయ్ పేరును ఎలక్ట్రానిక్, ప్రింట్ లేదా సోషల్ మీడియాలో ఎక్కడా ఉపయోగించరాదని కోర్టు స్పష్టం చేసింది.

ఈ కేసుకు సంబంధించి బండి సంజయ్ పేరును వాడుతూ ఎలాంటి తప్పుడు లేదా ప్రతిష్టకు భంగం కలిగించే వార్తలను ప్రసారం చేయకూడదని, రాయకూడదని మీడియా సంస్థలను ఆదేశించింది. దీనితో పాటు ఇప్పటివరకు మీడియా వేదికలపై తన పేరుతో వచ్చిన ఈ కేసుకు సంబంధించిన పాత వార్తలను, కథనాలను డిలీట్ (తొలగించే) చేసేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని కూడా బండి సంజయ్ కోర్టును విన్నవించారు.

మరోవైపు బండి భగీరథ్ కేసులో బాలిక వివరాలు సోషల్ మీడియాలో ప్రసారం కావడంపై కేసు నమోదైంది. బాలిక ఫొటోలు, వీడియోలు, తల్లిదండ్రుల వివరాల ప్రసారంపై కేసు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా బాలల సంక్షేమ కమిటీ ఛైర్ పర్సన్ ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. సోషల్ మీడియా నిర్వాహకుల మీద కేసులు పెట్టినట్టుగా చెప్పారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe