బండి భగీరథ్ పోలీసుల విచారణకు హాజరు కాలేదు. ఒక మైనర్ బాలికను వేధించారనే ఆరోపణలపై నమోదైన పోక్సో(POCSO) కేసులో విచారణ నిమిత్తం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్‌కు రావాలని పోలీసులు గతంలోనే నోటీసులు జారీ చేశారు. అయితే నిర్ణీత సమయానికి ఆయన పోలీసుల ముందుకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

తన 17 ఏళ్ల కుమార్తెను బండి భగీరథ్ వేధిస్తున్నాడంటూ సదరు బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఈ నెల 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తొలుత ఈ కేసులో బీఎన్‌ఎస్ (BNS) లోని సెక్షన్ 74, 75తో పాటు, పోక్సో చట్టంలోని సెక్షన్ 11 రెడ్‌విత్ 12 కింద అభియోగాలు మోపారు.
కేసు దర్యాప్తులో భాగంగా బాధితురాలి నుంచి సేకరించిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కేసులో పోక్సో చట్టంలోని అత్యంత కఠినమైన సెక్షన్ 5(l) రెడ్‌విత్ 6ను కూడా అదనంగా చేర్చారు. దీనివల్ల కేసు తీవ్రత మరింత పెరిగింది.
నోటీసులు ఇచ్చినప్పటికీ భగీరథ్ హాజరుకాకపోవడంతో పోలీసులు తదుపరి ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోసారి నోటీసులు జారీ చేస్తారా లేదా చట్టపరంగా ఇతర చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాలి. కేంద్రమంత్రి కుమారుడు కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం పెను సంచలనం సృష్టిస్తోంది.
హైకోర్టులో ముందస్తు బెయిల్
పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకునేందుకు భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్.ఐ.ఆర్ (FIR)ను కొట్టివేయాలని, లేదా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ మే 14న (గురువారం) వెకేషన్ బెంచ్ ముందుకు వచ్చే అవకాశం ఉంది.
సిట్ దర్యాప్తు
{{/usCountry}}పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకునేందుకు భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్.ఐ.ఆర్ (FIR)ను కొట్టివేయాలని, లేదా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ మే 14న (గురువారం) వెకేషన్ బెంచ్ ముందుకు వచ్చే అవకాశం ఉంది.
సిట్ దర్యాప్తు
{{/usCountry}}తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకుని, సమగ్ర విచారణ కోసం కుకట్‌పల్లి డీసీపీ రీతిరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.
కేసు ఏంటి?
17 ఏళ్ల బాలికను మభ్యపెట్టి, ఫామ్‌హౌస్‌లలో లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఫిర్యాదుతో మే 8న ఈ కేసు నమోదైంది. మరోవైపు భగీరథ్ తరపున ఇది 'హనీ ట్రాప్' అని, తనను బ్లాక్ మెయిల్ చేసి రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని కరీంనగర్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పోలీసులు ఈ రెండు కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.