Bandi Bhageerath Case : పోలీసుల విచారణకు హాజరుకాని బండి భగీరథ్

Bandi Bhageerath Case : బండి భగీరథ్‌ పోలీసుల విచారణకు హాజరుకాలేదు. ఇప్పటికే బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోక్సోలోని కఠినమైన సెక్షన్లను చేర్చారు.

Published on: May 13, 2026, 16:18:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బండి భగీరథ్ పోలీసుల విచారణకు హాజరు కాలేదు. ఒక మైనర్ బాలికను వేధించారనే ఆరోపణలపై నమోదైన పోక్సో(POCSO) కేసులో విచారణ నిమిత్తం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్‌కు రావాలని పోలీసులు గతంలోనే నోటీసులు జారీ చేశారు. అయితే నిర్ణీత సమయానికి ఆయన పోలీసుల ముందుకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

బండి సాయి భగీరథ్
బండి సాయి భగీరథ్

తన 17 ఏళ్ల కుమార్తెను బండి భగీరథ్ వేధిస్తున్నాడంటూ సదరు బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఈ నెల 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తొలుత ఈ కేసులో బీఎన్‌ఎస్ (BNS) లోని సెక్షన్ 74, 75తో పాటు, పోక్సో చట్టంలోని సెక్షన్ 11 రెడ్‌విత్ 12 కింద అభియోగాలు మోపారు.

కేసు దర్యాప్తులో భాగంగా బాధితురాలి నుంచి సేకరించిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కేసులో పోక్సో చట్టంలోని అత్యంత కఠినమైన సెక్షన్ 5(l) రెడ్‌విత్ 6ను కూడా అదనంగా చేర్చారు. దీనివల్ల కేసు తీవ్రత మరింత పెరిగింది.

నోటీసులు ఇచ్చినప్పటికీ భగీరథ్ హాజరుకాకపోవడంతో పోలీసులు తదుపరి ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోసారి నోటీసులు జారీ చేస్తారా లేదా చట్టపరంగా ఇతర చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాలి. కేంద్రమంత్రి కుమారుడు కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం పెను సంచలనం సృష్టిస్తోంది.

హైకోర్టులో ముందస్తు బెయిల్

పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకునేందుకు భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్.ఐ.ఆర్ (FIR)ను కొట్టివేయాలని, లేదా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ మే 14న (గురువారం) వెకేషన్ బెంచ్ ముందుకు వచ్చే అవకాశం ఉంది.

సిట్ దర్యాప్తు

తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకుని, సమగ్ర విచారణ కోసం కుకట్‌పల్లి డీసీపీ రీతిరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.

కేసు ఏంటి?

17 ఏళ్ల బాలికను మభ్యపెట్టి, ఫామ్‌హౌస్‌లలో లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఫిర్యాదుతో మే 8న ఈ కేసు నమోదైంది. మరోవైపు భగీరథ్ తరపున ఇది 'హనీ ట్రాప్' అని, తనను బ్లాక్ మెయిల్ చేసి రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని కరీంనగర్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పోలీసులు ఈ రెండు కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More