బిజీ బిజీగా సాగిపోయిన వారానికి వీడ్కోలు చెబుతూ, ఈ వీకెండ్‌ను గ్రాండ్‌గా ఎంజాయ్ చేసేందుకు హైదరాబాద్ సిద్ధమైంది. అక్షర ప్రియుల కోసం పుస్తక మేళా, చరిత్రను ప్రేమించే వారి కోసం సరికొత్త మ్యూజియం గ్యాలరీ, సంగీతం, నవ్వులు.. ఇలా ఒకటేమిటి, నగరవాసుల కోసం బోలెడన్ని ఆప్షన్లు ఉన్నాయి. డిసెంబర్ 26 నుంచి 28 వరకు మీరు వెళ్లదగ్గ ప్రధాన ఈవెంట్స్ వివరాలు మీకోసం..
1. సాలార్ జంగ్ మ్యూజియం: ఫౌండర్స్ గ్యాలరీ (ఆర్ట్ ఎగ్జిబిషన్)

హైదరాబాద్ చరిత్రను, కళా వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన సాలార్ జంగ్ కుటుంబానికి అంకితం చేస్తూ మ్యూజియంలో సరికొత్తగా 'ఫౌండర్స్ గ్యాలరీ'ని ప్రారంభించారు. సాలార్ జంగ్-1, 2, 3లకు సంబంధించిన వ్యక్తిగత వస్తువులు, అరుదైన చిత్రపటాలు ఇక్కడ కొలువుదీరాయి. ముఖ్యంగా జరీ పనితనంతో మెరిసిపోయే సింహాసనాలు, వెండి ఫర్నిచర్, అప్పట్లో వారు ధరించిన షేర్వానీలు, తలపాగాలను మీరు ఇక్కడ చూడవచ్చు.
ఎప్పుడు: శని, ఆదివారాలు; ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు
ఎక్కడ: సాలార్ జంగ్ మ్యూజియం, దారుల్ షిఫా
ప్రవేశ రుసుము: ₹50
2. 38వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన
నగరంలో అక్షర పండుగ బుక్ ఫెయిర్ మొదలైంది. ఎన్టీఆర్ స్టేడియం ఇప్పుడు సాహిత్య వేదికగా మారింది. ఈ మెగా ఈవెంట్‌లో సుమారు 50కి పైగా కథలు, నవలలను ఆవిష్కరించనున్నారు. పాత రాతప్రతులు మొదలుకొని చిన్నారుల పుస్తకాలు, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ వరకు వేల సంఖ్యలో పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌కు కాస్త విరామమిచ్చి (డిజిటల్ డిటాక్స్), పుస్తకాల ప్రపంచంలో విహరించాలనుకునే వారికి ఇది సరైన అవకాశం.
ఎప్పుడు: గురు, శుక్ర, శని, ఆదివారాలు; మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 గంటల వరకు
{{/usCountry}}ఎప్పుడు: గురు, శుక్ర, శని, ఆదివారాలు; మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 గంటల వరకు
{{/usCountry}}ఎక్కడ: తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం), లోయర్ ట్యాంక్ బండ్
ప్రవేశ రుసుము: ₹10, పిల్లలు: పదో తరగతి వరకు విద్యార్థులకు ప్రవేశం ఉచితం
3. మైఖేల్ జాక్సన్ ట్రిబ్యూట్ - మ్యూజిక్ కాన్సర్ట్
పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ అభిమానులకు ఈ వీకెండ్ స్పెషల్ ట్రీట్ అందనుంది. 'కూల్ సమ్మర్' బ్యాండ్ ఆధ్వర్యంలో ఎంజే సూపర్ హిట్ సాంగ్స్‌తో హార్డ్ రాక్ కేఫ్ హోరెత్తిపోనుంది. అతని ఐకానిక్ మూన్ వాక్, సిగ్నేచర్ డ్యాన్స్ మూవ్స్‌తో స్టేజీ దద్దరిల్లడం ఖాయం. 'బిల్లీ జీన్', 'బీట్ ఇట్' వంటి పాటలకు మీరు కూడా గొంతు కలపవచ్చు.
ఎప్పుడు: శనివారం; రాత్రి 9 గంటలకు
ఎక్కడ: హార్డ్ రాక్ కేఫ్, హైటెక్ సిటీ
ప్రవేశం: ₹499 నుంచి (district.in వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు)
4. గౌరవ్ కపూర్ లైవ్ (స్టాండ్-అప్ కామెడీ)
మిడిల్ క్లాస్ కష్టాలు, రిలేషన్‌షిప్స్, కాలేజీ రోజుల గురించి తనదైన శైలిలో జోకులు పేలుస్తూ యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదించుకున్న గౌరవ్ కపూర్ మీ ముందుకు వస్తున్నాడు. ఈ ఏడాదికి నవ్వుతూ వీడ్కోలు పలకాలంటే ఈ షోకు వెళ్లాల్సిందే.
ఎప్పుడు: ఆదివారం; రాత్రి 7.30 గంటలకు
ఎక్కడ: శిల్పకళా వేదిక, హైటెక్ సిటీ
ప్రవేశం: ₹799 నుంచి (BookMyShow లో అందుబాటులో ఉన్నాయి)
5. హైదరాబాద్ పికిల్‌బాల్ పార్టీ (క్రీడలు)
ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్న 'పికిల్‌బాల్' ఆటను మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ఈ పార్టీ మీకోసమే. గండిపేటలో నిర్వహించే ఈ ఈవెంట్‌లో ఆటలతో పాటు లైవ్ మ్యూజిక్, డ్యాన్స్ ఫ్లోర్, మినీ గేమ్స్ వంటివి ఉండబోతున్నాయి. కొత్తవారైనా, ప్రో-ప్లేయర్స్ అయినా ఎవరైనా పాల్గొనవచ్చు.
ఎప్పుడు: శని, ఆదివారాలు; సాయంత్రం 6 గంటలకు
ఎక్కడ: క్రాస్‌కోర్ట్ స్పోర్ట్స్, వట్టినాగులపల్లి, గండిపేట
ప్రవేశం: ₹1,200 నుంచి (district.in వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు)